ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే… విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే ఆ తప్పు ఎవరో ఒకరి నెత్తి మీద పడుతుంది. అందుకే… అందరూ …ఆ క్రెడిట్ కేసీఆర్‌దేనని విచారణ లకమిటీకి చెబుతున్నారు.
అప్పట్లో రిటైర్డ్ ఇంజినీర్లతో ఓ కమిటీ వేయించారు. ఆ కమిటీ నివేదిక ప్రకారమే చేశారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ రిటైర్డ్ ఇంజినీర్లు జస్టిస్ పి.పి. ఘోష్ కమిషన్ ముందు అసలు నిజం చెప్పేశారు. తాము చేసిన ప్రతిపాదనను వద్దని పక్కన పడేశారని తెలిపారు. తాము ఇచ్చిన నివేదిక లకాపీని కూడాజస్టిస్ ఘోష్‌కు అందించారు. ఆనకట్ట నిర్మాణానికి అనువైన స్థలంగా మేడిగడ్డను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని విశ్రాంత ఇంజినీర్లు కమిషన్ ముందు చెప్పారు. అంటే క్రెడిట్ వద్దన్నా కేసీఆర్ దగ్గరకే పోతోంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై కూ డా జస్టిస్ పిసి ఘోష్ దృష్టి సారించారు. బ్యారేజీల నిర్మాణంలో ఉన్న సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించే పనిలో కమిషన్ ఉంది. విచారణ ప్రక్రియలో భాగంగా విచారణకు పిలిస్తే ఎవరైనా రావాల్సిందే అని లేకపోతే ఏం చేయాలో తనకు తెలుసంటున్నారు. మొత్తంగా కాళేశ్వరం లోనూ కేసీఆర్ నిండా మునుగుతున్నట్లుగా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.