తమను మల్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని వాలంటీర్లు టీడీపీ నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. తమతో బలవంతంంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీసులుకు ఫిర్యాాదు చేసేందుకు వెనుకాడటం లేదు. వారి బాధ ఇప్పుడు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోమనే. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలు. అందులోసందేహం లేదు. కానీ ఎన్నికల ప్రక్రియలో వారి జోక్యం ఉండకుండా ఈసీ చర్యలు తీసుకోవడంతో వారితో రాజీనామాలు చేయించి పోలింగ్ బూతుల్లో ఏజెంట్లుగా కూర్చోబెట్టి ప్రజల్ని భయపెట్టాలని అనుకున్నారు.
కానీ రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో సగం మంది రాజీనామా చేయలేదు. లక్ష మందికిపైగా రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ల జీతాలను పదివేలకు పెంచుతామని.. ఇతర ఉపాధి చూపిస్తామని హామీ ఇచ్చింది. దీంతో రాజీనామా చేసిన వాలంటీర్లంతా గగ్గోలు పెడుతున్నారు. మళ్లీ తమను తీసుకోవాలని అంటున్నారు. అయితే రాజీనామా చేసిన వాలంటీర్లు సైలెంట్ గా ఉండలేదు… ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. వైసీపీ కోసం పని చేశారు. చివరికి ఎటూ కాకుండా పోయారు.
ప్రభుత్వం ఇంకా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేదు. వాటిపై పరిశీలన చేసి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజీనామా చేసిన వాలంటీర్లను మాత్రం మళ్లీ తీసుకునే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.