ఏపీలో వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నేతలు రెడీ అవుతున్నారా..? ఇప్పటికే పార్టీ మార్పుపై కొంతమంది టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారా..? ఐదేళ్ళు టీడీపీ నేతలను టార్గెట్ చేసుకొని వేధించిన వైసీపీ నేతల చేరికలను టీడీపీ స్వాగతిస్తుందా..?
ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్. ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీ భవిష్యత్ పై ఆ పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ కేవలం 11 మందికి మాత్రమే పరిమితం అవ్వడంతో వైసీపీ ఫ్యూచర్ పై పరేషాన్ అవుతున్నారు. ఇంకా వైసీపీని వేలాడపట్టుకొని రాజకీయాలు చేస్తే భవిష్యత్ ఉండదని పార్టీ మారేందుకు కోస్తాంధ్ర వైసీపీ నేతలు రెడీ అయినట్లు సమాచారం.
పార్టీ మార్పుపై వైసీపీ నేతలు టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారని కానీ, వారిని పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు సుముఖంగా లేరని సమాచారం. వైసీపీలో ఉంటూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఏ నాయకుడిని చేర్చుకునేది లేదని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ళు టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసిన అనుభవాల దృష్ట్యా…వైసీపీ నేతల చేరికను నిర్దద్వంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
కూటమి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంతో పార్టీ ఫిరాయింపులు లేకుండా పాలనపై ఫోకస్ చేయాలని అధిష్టానం కూడా భావిస్తోంది. దీంతో టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తోన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతల చేరికలకు టీడీపీ గేట్లు క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది