మూడు సార్లు వాయిదా పడ్డ ‘కల్కి 2898 ఎ.డి’ భైరవ పాట ఎట్టకేలకు విడుదలైయింది. సంతోష్ నారాయణ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి, కుమార్ రచించిన ఈ పాట… దిల్జీత్ దోసాంజ్, దీపక్ బ్లూ కలిసి ఆలపించారు. వినగానే కనెక్ట్ అయ్యే పంజాబీ బీట్స్ తో ఈ పాటని కంపోజ్ చేశారు. కల్కి సెట్స్ లో ప్రభాస్, దిల్జీత్ దోసాంజ్ పై ఈ పాటని ఆల్బమ్ లా షూట్ చేశారు.భైరవ పాత్రని వర్ణించేలా లిరిక్స్ సాగాయి.
ఒక నేనే… నాకు చుట్టూ నేనే.
ఒక్కటైనా ఒంటరోణ్ని కానే.
వీరుడినే… యోధుడినే..
భూమి నేనే సూర్యుడైన నేనే,
నన్ను నేనే చుట్టి తిరుగుతానే,
స్వార్థము నేనే పరమార్థము నేనే.. అంటూ వినిపించిన సాహిత్యం ఆకట్టుకునేలా వుంది.
‘సాహస మంత్రమే నా జవజీవం,
సమయం చూడని సమరమిది..
సాయుధ యంత్రమే లోహపు దేహము.
నా కథే విధి గెలవనిది’ అంటూ పవర్ ఫుల్ పంచ్ లో పాటని ముగించడం బావుంది.
కల్కి నుంచి వచ్చిన మొదటి సాంగ్ ఇది. పాన్ ఇండియా ని ద్రుష్టిలో పెట్టుకొని హిందీ, పంజాబీ, తెలుగు ఇలా అనేక కోణాల్లో ప్రేక్షకులని ఆకట్టుకునేలా సాంగ్ డిజైన్ చేశారు. ప్రభాస్ కటౌట్ పాటకు మరింత పవర్ తీసుకొచ్చింది. జూన్ 27 సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.