తమిళనాట స్టాలిన్‌కు పోటీ ఎవరు అన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. అన్నామలైకు తమిళనాడులో తప్ప బయట కావాల్సినంత హైప్ వస్తోంంది. తమిళనాడులో పట్టించుకునేవారు లేరు. పన్నీరు సెల్వం, పళనిస్వామి అసలు రేసులో ఉండలేకపోతున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు . ఆయన ప్రభావం ఎంత ఉంటుందో తెలియడం లేదు. ఇలాంటి సమయంలో మరోసారి శశికళ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
గతంలో శశికళ సీఎం పదవి చేపట్టాల్సిన రోజున … జైలుకెళ్లారు. దాంతో తమిళనాడు రాజకీయం మారిపోయింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత పలుమార్లు అన్నా డీఎంకే రాజకీయాల్లో జోక్యంచేసుకునే ప్రయత్నం చేసినా ఎవరూ పడనీయలేదు. తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. అన్నాడీఎంకే క్రమంగా బలహీనపడుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. కుదరకపోతే తన మేనల్లుడి పార్టీతో రాజకీయం చేయాలనుకుంటున్నారు.
శశికళకు జయలలిత స్నేహితురాలు మాత్రమే కాదు.. మొత్తం జయలలిత వ్యవహారాలన్నీ ఆమె చూస్తారు. జయలలిత అనారోగ్యం, ట్రీట్ మెంట్ మొత్తం ఆమె కనుసన్నల్లోనే జరిగింది. జయలలిత అక్రమాస్తుల కేసుల్లోనే ఆమె జైలుకెళ్లింది. అయితే రాజకీయంగా ఆమెది ఎప్పుడూ వివాదాస్పద వ్యవహారశైలే. ఎప్పుడూ నేరుగా రాజకీయాలలోకి రాలేేదు కానీ.. పార్టీపై పట్టు ఆమేకే ఉండేది.