వైసీపీ అధినేత జగన్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
తాము ఏపీ ప్రజలకు మంచే చేశామని, ఓడినా ప్రజల ఆశీర్వాదం తమపై ఎల్లప్పుడూ ఉంటుందని జగన్ ఇటీవల చెబుతూ వస్తున్నారు. తమకు ప్రజలే అండగా నిలుస్తారని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి తన ఇంటి చుట్టూ కాపలా కోసం ముప్పై మంది ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది.
ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమి పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. దీంతో తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద భద్రతా సిబ్బందిని కూటమి సర్కార్ తొలగించడంతో ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30మందిని నియమించుకున్నారు జగన్.
గత సర్కార్ అవలంభించిన విధానాలకు విసుగెత్తిన కొంతమంది వైసీపీ నేతల ఇళ్ళపై దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలోని తన ఇంటిపై దాడులు జరిగే అవకాశం ఉందని జగన్ భావించే ప్రైవేట్ సెక్యూరిటిని నియమించుకున్నారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే, తమకు ప్రజలే అండగా ఉంటారన్న జగన్ భద్రత సిబ్బంది కోసం ప్రభుత్వాన్ని కోరకుండా సొంత ఖర్చులతో ప్రైవేట్ సిబ్బందిని నియమించుకోవడం గమనార్హం.