ఏపీ హోంత్రులుగా దళిత మహిళలే ఉంటున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఇద్దరు దళిత హోంమంత్రులు ఉన్నారు. ఒకరు మేకతోటి సుచరిత, మరొకరు వనిత. అయితే తాము హోంమంత్రులమన్న సంగతి వీరిద్దరికి కూడా గుర్తుందో లేదోనని అప్పట్లో అందరూ సెటైర్లు వేసేవారు. ఎందుకంటే ఎప్పుడైనా గొడవలు జరిగితే పార్టీ తరపున మాట్లాడినట్లుగా మాట్లాడటం తప్ప… బాధ్యతాయుతమైన మంత్రులుగా ఎప్పుడూ వ్యవహిరంచలేకపోయారు.
ఎలాంటి ఘటనలు జరిగినా తెరపైకి సజ్జల వచ్చేసేవారు. మొత్తం పోలీసు వ్యవస్థ ఆయన గుప్పిట్లో ఉండేది. ఫలితంగా హోంమంత్రుల మాట కానిస్టేబుళ్లు కూడా వినేవారు కాదు. కానీ తెలుగుదేశం హయాంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత అలా కాదు. ఆమె స్వయంగా పోలీస్ డిపార్ట్ మెంట్ ను డీల్ చేయబోతున్నారు. తనకు పై నుంచి స్క్రిప్ట్ రావాల్సిన అవసరం లేదని.. తన బాధ్యతలు తనకు తెలుసని ఆమె డైనమిక్ గా వ్యవహరిస్తున్నారు.
వంద రోజుల్లో గంజాయిని లేకుండా చేస్తామని ప్రకటించారు. అందుకే పోలీసులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి నుంచి మరో లెక్క అని.. గంజాయి వ్యాపారం చేసే వారు ఎవరైనా వెంటనే క్లోజ్ చేసుకోవాలని.. లేకపోతే నేరుగా జైలుకె వెళ్తారని హెచ్చరించారు. ఇక మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదులపైనా ఓ పర్ ఫెక్ట్ యాక్షన్ రెడీ అవుతోంది. కొంతమంది అకౌంట్లు డిలీట్ చేసుకున్నా వారి వివరాలన్నీ బయటకు లాగుతున్నారు. మార్ఫింగ్లు చేసిన వారిని వదలకుండా.. తాటతీయాలని డిసైడయ్యారు.