ప్రభుత్వ పెద్ద ఎలా ఉంటే.. కింద ఉండేవారు అంతా అలాగే ఉంటారు. ఆయనే ఎంతో కొంత వెనకేసుకోవాలని దోపిడీ చేస్తే.. కింద ఉన్న వారు ఊరుకుంటారా… పైన వ్యక్తే ఆదర్శంగా చెలరేగిపోయారు. ఏ శాఖలో చూసినా అడ్డగోలు దోపిడీతో జరిగిన దందాలే బయటపడుతున్నాయి. ఈ వ్యూవహాలు చూసి మంత్రులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతా ఘోరంగా అవినీతికి పాల్పడి ప్రజాధనం దోచేస్తూంటే వ్యవస్థం చేస్తున్నాయని విస్మయానికి గురవుతున్నారు.
గనుల శాఖలో అడ్డగోలు దోపిడి
గనుల శాఖలో దోపిడీకి లెక్కా పత్రం లేదు. ప్రభుత్వానికి ఎంత కడితే అంత. మిగతా ఎంతైనా దోపిడీచేసుకోవచ్చు. ఇసుక దగ్గర నుంచి మైనింగ్ సీవరేజీ వసూలు వరకూ మొత్తం .. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత తవ్వుకుంటున్నారు… ఎంత వసూలు చేస్తున్నాన్నర లెక్కలేమీ లేవు. అస్మదీయుల్ని తీసుకొచ్చి అడ్డగోలుగా నియమించి వసూళ్లు చేసుకున్నారు. ఇప్పుడీ లెక్కలన్నీ బయటకు తీయడానికి రెడీ అయ్యారు.
ఆదాయార్జన శాఖలన్నింటిలోనూ ఇదే దోపిడీ
ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే శాఖలు కొన్ని ఉంటాయి. మైనింగ్ తో పాటు రెవిన్యూ, , వాణిజ్యపన్నులు, అబ్కారీ, రిజిస్ట్రేషన్లు ఇాలాంటి శాఖలో ఉంతాఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దూరిపోయారు. సలహాదారుల పెత్తనం పెద్దదైపోయింది. చివరికి అసలు ఉద్యోగులు పక్కకెళ్లిపోయారు. మొత్తం వ్యవహారం దోపిడీ కోసం పెట్టుకున్న ముఠా చూసుకుంది. దాంతో అంతే లేని అవినీతి చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్లిపోయింది.
అసెంబ్లీలో సంచలన విషయాలు బయట పెట్టనున్న ప్రభుత్వం
అసెంబ్లీలో ప్రభుత్వం బయట పెట్టబోయే విషయాలు సంచలనం సృష్టించబోతున్నాయి. ఓ ప్రభుత్వం ఎంత ఘోరంగా ప్రజాద్రోహానికి పాల్పడింతే ఆధారాలతో సహా అసెంబ్లీలో స్క్రీన్ పెట్టి మరి చూడనున్నారు. ప్రతీ దాంట్లోనూ ఇలాంటి దోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ముఖ్యమైనవి అసెంబ్లీలో ప్రదర్శించి .. మిగతావి పబ్లిక్ డోమైన్లో విడుదల చేసే అవకాశం ఉంది. బాధ్యులైన అందరిపై కేసులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.