జగన్ రెడ్డి సీఎం రేంజ్ నుంచి సాదాసీదా ఎమ్మెల్యే స్థాయికి పడిపోయిన తన ఓల్డ్ మోడల్ రాజకీయాలను మాత్రం ఆపడం లేదు. ఓడిపోయిన పది రోజుల్లోనే ఆయన నిర్వాకాలు రోజుకు ఒకటి చొప్పున వెలుగు చూసి సంచలనం సృష్టిస్తున్నాయి. తాడేపల్లి ఫర్నీచర్, రుషికొండ ప్యాలెస్, పోలవరం నిర్వాకం ఇలా వరుసగా అన్నీ బయటకు వస్తున్నాయి. అయితే ఇవి అంతంతమాత్రమేనని అసలైనవి బయటకు వచ్చేవి చాలా ఉన్నాయని లోకేష్ చెబుతున్నారు.
మరో వైపు తాడేపల్లి ఇంటి ముందు రోడ్లు ఆక్రమించిన వైనం కూడా బయటపడింది. దీంతో జగన్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ ప్లాన్ చేసుకున్నారు. పొద్దున్నే లేవగానే ఈవీఎంలు వద్దు బ్యాలెట్లు ముద్దు అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి అందరూ ఆయనపై జాలిపడేవాళ్లే. ఎందుకంటే ఈవీఎం ఫలితాలపై అనుమానం ఉంటే.. ఆధారాలుంటే నేరుగా కోర్టుకు వెళ్లవచ్చు. లేదా వీవీ ప్యాట్లు లెక్కించాలని ఈసీని కోరుకోవచ్చు. నలభై వేలు కడితే ఈవీఎంలను..వీవీ ప్యాట్లను సరి చూసుకోవచ్చు.
మరో వైపు ఇదే జగన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఈవీఎంలకు ఇచ్చిన పర్ ఫెక్ట్ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్నాయి. ఈవీఎంలను మించినవి దేశంలో లేవని చెప్పుకొచ్చారు. అప్పుడు గెలిచేస్తారని నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఈవీఎంలు అన్నారు.. ఇప్పుడు ఫలితాలొచ్చిన తర్వాత రివర్స్ అవుతున్నారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్లను రాజకీయాల్లో తేడాగా చూస్తారు.