జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంలపై ఇండియా కూటమి వాదలను గట్టిగా వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు మన దేశంతో సంబంధం లేని ప్యూర్టోరికో ఈవీఎంల గురించి ఎలాన్ మాస్క్ మాట్లాడితే దాన్ని ఇండియాకు అన్వయించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ఈవీఎంలపై మాట్లాడారు.ఇప్పుడు ఆయన మాటల్ని జగన్ అందుకున్నారు. మామూలుగా అయితే కాంగ్రెస్ అభిప్రాయాలతో ఏకీభవించే అవకాశమే ఉండదు. కానీ ఇప్పుడు ఈవీఎంలపై కాంగ్రెస్ వాదన వినిపిస్తున్నారు.
ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు.. తాను చేస్తున్న లాబీయింగ్ ఏ మాత్రం ఆశాజనంగా లేకపోవడంతోనే జగన్ ఇలా … ఇండియా కూటమి వైపు వె ళ్తానన్న సంకేతాలను పంపుతున్నారన్న అభిప్రాయం ఢిల్లీలో వినిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే అనుమానాస్పదంగా ఉన్నారు.. ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వారంతా తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారు . వారిని ప్రధానంగా బీజేపీ ఆకర్షిస్తోందని అంటున్నారు. దీనిపై స్పష్టత రావడంతో.. నేరుగా తిరగబడలేక.. జగన్ … విపక్షానికి దగ్గరవుతానన్న సంకేతాలు పంపుతున్నారని భావిస్తున్నారు.
అయితే నేరుగా ఇండియా కూటమికి దగ్గరవ్వలేరు. అదే జరిగితే ఆయన పరిస్థితి ఏమిటో బాగా తెలుసు. అందుకే సింపుల్ గా బ్లాక్ మెయిల్ లా ట్వీట్లు, ప్రకటనలు చేసి ఢిల్లీలో తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారు. కానీ జగన్ రెడ్డి టైం అయిపోయిందని ఇక చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించడమే మిగిలి ఉందన్న సెటైర్లు వేస్తున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో వివేకా కేసు సహా సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇండియా కూటమిలో చేరితే…కనీసం ప్రతిపక్షాల్ని వేధిస్తుననారన్న సానుభూతి అయినా సంపాదించుకోవచ్చని ఆయనకు ఇప్పటి నుంచే సలహాలు అందుతున్నాయి.