రుషికొండ ప్యాలెస్‌కు రూ. ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం .. లక్షల ఖరీదైన కమోడ్లు.. టాయిలెట్ సీట్లు… బాత్ టబ్‌లు పెట్టుకున్నారు. ఇదంతా ఉత్తరాంంధ్ర అభివృద్ధి కోసమని వాదిస్తున్నారు. నిజానికి ఈ ఐదు వందల కోట్లు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై పెడితే లక్షల ఎకరాల్లో ఇప్పుడు పంటలు పండేవి.
వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేస్తే ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 50 వేల ఎకరాలకు సాగునీరు అదనంగా అందించవచ్చు. తెలుగుదేశం హయాంలో ఈ అనుసంధానం పనులు దాదాపు 60 శాతానికి పైగా పూర్తి అయ్యాయి. 19 టియంసిల సామర్థ్యంతో హిరమండలం జలాశయం దాదాపు పూర్తయింది. ఈ జలాశయం నుంచి నాగావళి నదిపై నిర్మితమైన నారాయణపురం ఆనకట్ట వరకు 33 కిలోమీటర్ల కాలువ తవ్వితే చాలు. కానీ చేయలేదు.
నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిషా రాష్ట్రంలో 106 ఎకరాల భూమి ముంపునకు గురౌతుందని, దానిని ఒడిషా సేకరించి ఇవ్వాలని వంశధార ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దానికి నిధులు ఏపీ ఇవ్వాలి. కానీ పట్టించుకోలేదు. తోటపల్లి ప్రాజెక్టు విస్తరణ కూడా అలాగే. ప్రాజెక్టుల వారీగా చూసుకుంటే… ఐదేళ్లలో కనీసం రూ. వెయ్యికోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. కానీ ఒక్క రుషికొండ ప్యాలెస్ కు మాత్రం ఏకంగా ఐదు వందల కోట్లు ఖర్చు చేసి… శరవగంగా నిర్మించారు.
అదే ఆ సొమ్ము ఉత్తరాంద్ర ప్రాజెక్టులపై ఖర్చు పెట్టి ఉంటే ఖచ్చితంగా ఆయనకు కొన్ని ఓట్లు పెరిగి ఉండేవి.