రోజా ఓ సారి ఎయిర్ పోర్టులో కనిపిస్తే జనసైనికులు దాడి చేసినంత పని చేశారు. అప్పుడు ఆమె మంత్రి పదవిలో ఉన్నారు. అంబటి రాంబాబు ఖమ్మంలో కనిపిస్తే కొంత మంది టీడీపీ ఫ్యాన్స్ కొట్టినంత పని చేశారు. పేర్ని నాని హైదరాబాద్ లో కనిపిస్తే జనసైనికులు బడితెపూజ చేయబోతే పారిపోయారు. ఇవన్నీ వారంతా పదవుల్లో ఉన్నప్పుడు జరిగినవే. ఈ ఘటనలు చూస్తే… వీరికి అధికారం పోయిన తర్వాత ఎక్కడా బతకలేరని.. అన్ని పార్టీల కార్యకర్తలు ఎక్కడ కనిపించినా తరిమికొడతారని అనుకున్నారు. టీడీపీ బంపర్ మెజార్టీతో గెలిచింది. కానీ ఐదేళ్లు టార్చర్ పెట్టిన రాజకీయ నేతలు హాయిగానే ఉన్నారు.
ఐదేళ్ల నరకానికి టీడీపీ క్యాడర్‌కు సాంత్వన లభిస్తోందా ?
ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ క్యాడర్ పడిన బాధ్యతలు, ఆ పార్టీ నేతలు గడిపిన నిద్రలేని రాత్రులు, నేతల కుటుంబాలపై చేసిన కామెంట్లు, సోషల్ మీడియా వేధింపులు భరించినవారు తమకు ఒక్క చాన్స్ వస్తే … అంతకు అంత పగ తీర్చుకుంటామనుకున్నారు. ఒక్క నోటీసు ఇస్తే పోలీస్ స్టేషన్ కు వచ్చే కేసుల్లో అర్థరాత్రుళ్లు ఇళ్లపై దాడి చేసి తలుపులు పగులగొట్టి తీసుకెళ్లేవాళ్లు పోలీసులు. బీటెక్ రవి లాంటి నేత అప్పటి వరకూ పులివెందులలో ఉన్నా సరే… విమానం ఎక్కడానికి ఎయిర్ పోర్టుకు పోగానే ఓ టెర్రరిస్టును అరెస్టు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి పరువు తీసేలా అరెస్టులు చేశారు. ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని జరిగాయి. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త రక్తం మరిగిపోయిది. అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలనుకున్నారు.
తమపైనే దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవడం గొప్పతనమా ?
టీడీపీ నేతృత్వంలోని కూటమి గెలిచింది. కానీ నారా లోకేష్ అధికారంలోకి వచ్చినా ముగ్గురు కార్యకర్తల్ని కోల్పోయాం .. సంయమనం పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆ కార్యకర్తలు కేవలం రాజకీయ కారణాలతో హత్యకు గురైతే .. సంయమనం పాటించడం ఖచ్చితంగా పార్టీ క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు పంపేదే . పార్టీ క్యాడర్ ఎలాంటి దాడులు చేయకపోయినా చేసినట్లుగా వైసీపీ ప్రచారం చేస్తోంది. రివర్స్ లో టీడీపీపై దాడులు జరుగుతున్నాయి.
మంచితనమైనా.. చేతకానితనమైనా రెండూ ఒక్కటే !
విజయసాయిరెడ్డి దగ్గర్నుంచి వర్రా రవీంద్రారెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, ఇంటూరి సాయికిరణ్ రెడ్డి సహా పదుల సంఖ్యలో చంద్రబాబు కుటుంబాన్ని దూషించేవారు. నారా లోకేష్‌పై ఘోరమైన వ్యాఖ్యలు చేసేవారు. ప్రభుత్వం మారిన వీరంతా హాయిగా ఉన్నారు. ఒక్కరూ అరెస్టు కాలేదు. నేరుగా పట్టుకుని దాడి చేసికొట్టకపోయినా .. కనీసం చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయారు. గతంలో అనిత, ఆదిరెడ్డి భవాని వంటి నేతలపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయలేకపోయారు. చట్ట పరమైన పాలనకు చాన్సిస్తామని.. లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉండేలా చూసుకుంటామని టీడీపీ చెబుతోంది కానీ… ఇది మంచితనమా.. చేతకాని తనమా అన్న డౌట్ క్యాడర్‌కు వస్తోంది. రెండింటిలో ఏదైనా క్యాడర్‌కు రుచించదు. ఇన్‌స్టంట్‌గా చర్యలు ప్రారంభిస్తేనే క్యాడర్ చల్లబడుతుంది. లేకపోతే నిస్సత్తువ ఆవరిస్తుంది.