జగన్ షెడ్యూల్ అనగానే ప్రతి శుక్రవారం కోర్టుకు హజరవ్వాలి. ప్రతిపక్ష నేతగా ఉన్నా, అంతకు ముందు కూడా ఇదే షెడ్యూల్. అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుల చుట్టూ తిరగుతుండే వారు. ఆయన దాదాపు 11సీబీఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు.
బెయిల్ పై ఉన్న జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిందన్న నిబంధన ఉండేది. కానీ సీఎం అయ్యాక… అధికారిక పనుల పేరుతో ప్రత్యక్ష హజరు నుండి మినహాయింపు పిటిషన్లు, ఆబ్సెంట్ పిటిషన్లు వేస్తూ కాలం గడిపారు.
కానీ, ఇప్పుడు సీఎం కాదు. ప్రతిపక్ష నేత కూడా కాదు. కేవలం సాధారణ ఎమ్మెల్యే. మాజీ ముఖ్యమంత్రి అంతే. దీనికి తోడు జగన్ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల్లో కోర్టు రోజువారి విచారణ మొదలుపెట్టబోతుంది. దీంతో జగన్ ను విచారణ సమయంలో కోర్టుకు పిలుస్తారన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే జగన్ ఏపీ కన్నా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండాల్సి వస్తుందని వైసీపీ భావిస్తోంది.
మొన్నటి వరకు చంద్రబాబును హైదరాబాద్ లో ఉంటున్నారని విమర్శించిన వైసీపీ నేతలు… ఇప్పుడు అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ హైదరాబాద్ లో ఉంటే ఎలా సమర్థించుకుంటారో చూడాలి.