కాంగ్రెస్ మహా సముద్రం .. వైసీపీ పిల్ల కాలువ.. పిల్ల కాలువలన్నీ చివరికి సముద్రంలో కవాల్సిందేనని షర్మిల తేల్చి చెప్పేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయన్న సంకేతాలు ఇచ్చారు. షర్మిల రెండు రోజుల పాటు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలందర్నీ కలిసి వచ్చారు. తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికలు జగన్ కు వ్యతిరేకంగా ఓటేయాలన్నసింగిల్ పాయింట్ ఎజెండాగానే జరిగాయని అందుకే ఓట్లు పోలరైజ్ అయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని ఆశించాం కానీ..ఈ కారణంగానే ఒక్క ఓటును కూడా వృధా చేయకూడదన్నట్లుగా ప్రజలు కూటమికి వేశారన్నారు. కడపలో తాను పధ్నాలుగు రోజులే ప్రచారం చేశానని తాను పోటీ చేస్తున్నట్లుగా చాలా గ్రామాల్లో తెలియలేదన్నారు. అయినా తమకు నిరాశ లేదని.. పోరాడతామన్నారు. వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని స్పష్టం చేశారు.
వైసీపీ నేతల్ని ఆకర్షించి.. దళిత, ముస్లిం ఓటు బ్యాంక్‌ను వెనక్కి తెచ్చుకోవాలన్న టార్గెట్‌తో కాంగ్రెస్ ఉంది. వైసీపీ ఎంత బలహీనం అయితే.. కాంగ్రెస్ అంత బలపడుతుంది. ప్రస్తుతం జగన్ పరిస్థితి ఘోరంగా ఉంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంంగా కాంగ్రెస్ బలపడుతుందన్ననమ్మకంతో ఎక్కువ మంది ఆ పార్టీ వైపు చూసేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరికి వైసీపీ కూడా కాంగ్రెస్‌లో కలవాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.