కల్కి కథని మరింత లోతుగా వివరించాడు నాగ్ అశ్విన్. ఇటివల విడుదల చేసిన వీడియోలో కథని పరిచయం చేసిన ఆయన ..ముంబైలో జరిగిన ఈవెంట్ లో ప్రదర్శించిన వీడియోలో మరింత వివరంగా కథని చెప్పాడు. మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ ఇది. అవి కాశీ, కాంప్లెక్స్, శంబాలా. కాశిలో నాగరికత పుట్టుక మొదలైంది. ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టిందట.
గంగా ఎండిపోవడంతో కాశీ ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తుంటారు. అదే సమయంలో ‘కాంప్లెక్స్’ లో సకల సౌకర్యాలు వుంటాయి. అది బలవంతుల చేతిలో వుంటుంది. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే మిలియన్ల కొద్దీ యూనిట్స్ కలిగి ఉండాలి. ఈ రెండు ప్రపంచాలు కాకుండా మరో ప్రపంచం కూడా వుంది. అదే శంబాలా. ఇక్కడ నుంచే విష్ణు చివరి అవతారం వస్తుంది. ఈ మూడు ప్రపంచాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ ‘కల్కి’ కథ నడుస్తుంది’అని చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్.