త్వరలోనే కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా…? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలను సైతం పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ మొదలు పెట్టిందా…? శాసన సభలో తమ దూకుడుగా బ్రేకులు పడినా మండలిలో తమకున్న సంఖ్యాబలంతో కాంగ్రెస్ కు కళ్ళెం వేయాలనుకున్న బీఆర్ఎస్ ప్లాన్ కు రేవంత్ అండ్ కో కౌంటర్ వ్యూహం రెడీ చేస్తోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ కు చెందిన 22మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈమేరకు మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా నిలువరిచేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ రంగంలోకి దిగి పార్టీ మార్పుపై తొందరపడొద్దని పలువురు ఎమ్మెల్యేలకు నచ్చజెప్తోంది. అయితే, ఎమ్మెల్యేలు చేజారినా తమకు మండలిలో పూర్తి బలం ఉందని అక్కడే తమ ఆధిపత్యాన్ని చాటుతూ, సర్కార్ ను ఇరుకున పెట్టాలనుకున్న కేసీఆర్ వ్యూహానికి కాంగ్రెస్ కౌంటర్ సిద్దం చేస్తోంది.
త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అందులో కొన్ని నిర్ణయాలు, బిల్లులు పాస్ చేసేందుకు సర్కార్ సిద్దం అవుతోంది. బిల్లులు పాస్ కావాలంటే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంది. కానీ, మండలిలో బీఆర్ఎస్ కు ఫుల్ మెజార్టీ ఉండటంతో బిల్లుల ఆమోదానికి అడ్డంకిగా మారే పరిస్థితులు ఉన్నాయి. మండలిలో సంఖ్యాబలం ఉందని అక్కడే కాంగ్రెస్ దూకుడుగా బ్రేకులు వేయాలనుకున్నా… బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకొని కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.