ఏపీలో కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించారు. ఆయన వెంటనే చార్జ్ తీసుకుంటారు. ఈసీ నియమించిన హరీష్ కుమార్ గుప్తాను హోంశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. అంతకు ముందు ఆయన అక్కడే ఉన్నారు. చంద్రబాబు గుప్తానే కొనసాగించాలనుకున్నారు కానీ చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజున ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోయారు. ఫలితంగా ఆయనను తప్పించాలని నిర్ణయించారు. గవర్నర్ కూడా ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలతో డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించారు. సీనియార్టీలో ఆనే ముందున్నారు. ద్వారకా తిరుమల రావు వ్యవహారంపైనా టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. జగన్ రెడ్డి మెప్పు కోసం ఆయన కూడా కొన్ని తప్పులు చేశారని అంటూంటారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడం వంటివాటిని కారణాలుగా చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు వద్దన్నా ఇస్తే.. ఆయనను బదిలీ చేసి వేరేవారిని నియమిస్తారు..తప్ప… అక్కడ మారేదేమీ ఉండదని… కానీ ద్వారకా తిరుమల రావు టీడీపీ అధినేతతో మంచి సంబంధాలు ఉన్న అధికారేనని చెబుతున్నారు.
ఏబీ వెంకటేశ్వరరావుకు చివరి రోజు పోస్టింగ్ ఇచ్చి అదే రోజు రిటైర్మెంట్ ఇచ్చారు. ఆయనకు వీడ్కోలు చెప్పేందుకు ఎవరూ రాలేదు. ద్వారకా తిరుమల రావు మాత్రమే వచ్చారు. అప్పటికి ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో ఆయన పేరు డీజీపీగా పరిశీలనలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు పోలీసు వర్గాల నుంచి ఓ రకమైన దూకుడజు కోరుకుంటున్నారు. అది ఇప్పుడైనా వస్తుందని… గట్టి నమ్మకంతో ఉన్నారు. ద్వారకా తిరుమల రావు టీడీపీ క్యాడర్ అంచనాల్ని అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది.