జగన్మోహన్ రెడ్డి రిపబ్లిక్ చానల్లో చర్చకు రావాలని ఆర్నాబ్ గోస్వామి కోరారు. విశాఖలో రుషికొండ ప్యాలెస్ లో పర్యావరణ విధ్వంసం చేసి ఐదు వందలకోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్యాలెస్ ఆయనను బాగా హర్ట్ చేసింది. వరుసగా రెండో రోజు కూడా తన చానల్లో చర్చా కార్యక్రమం నిర్వహించారు. చర్చలో వైసీపీ తరుపున పాల్గొనేందుకు బేసిక్స్ తెలియని.. తెలుగు చానళ్లలో కూర్చుని బూతులు తిట్టే వ్యక్తిని కూర్చోబెట్టడంతో ఆయన మాట్లాడిన మాటలతో జగన్ రెడ్డి పరువు పోయింది. వారూ..వీరు ఎందుకు నేరుగా జగన్ రెడ్డే డిబేట్కు రావాలని ఆర్నాబ్ అడుగుతున్నారు .
చంద్రబాబు ఇప్పటికే అనేక సార్లు ఆర్నాబ్ తో డిబేట్ లో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఆర్నాబ్ తో డిబేట్ అంటే…. గడగడలాడిపోతారు. కానీ నారా లోకేష్ ధైర్యంగా ఆర్నాబ్ తో చర్చలో పాల్గొన్నారు. ఈ అంశంపై జగన్ తో చర్చకు సిద్ధమని.. బ్రింగ్ ఇట్ ఆన్ అని సవాల్ చేశారు. కానీ జగన్ రెడ్డి వైపు నుంచి చప్పుడు లేదు. ఇప్పుడు పదవి పోయింది. జగన్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ తో కాదు.. తనతోనే చర్చకు రావాలని ఆర్నాబ్ అడుగుతున్నారు.
జగన్ రెడ్డి సాదాసీదా జర్నలిస్టుకు కూడా సమాధానాలు చెప్పలేరు. ఆయనకు అంత నాలెడ్జ్ లేదు. రాసి పెట్టిన పేపర్లు ఇస్తే చదివి సమాధానాలు చెబుతారు. రికార్డెడ్ ఇంటర్యూలు తప్ప.. లైవ్ ఇంటర్యూలు ఇచ్చిందే లేదు. ఇక నేరుగా ఆర్నాబ్ దగ్గరకు వెళ్తే నలిగిపోతారు. అందుకే ఆయన ఎన్ని చాలెంజ్ లు విసిరినా వినపడనట్లుగా సైలెంట్ గా ఉంటారు కానీ.. స్పందించేందుకు సిద్ధపడరు. ఎందుకో వైసీపీ నేతలకు బాగా తెలుసు.