ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ పున్యమాని అభిమాన తారలు డైరెక్ట్ గా ప్రేక్షకులతో మాట్లాడేస్తున్నారు. సినిమా గురించి ప్రేక్షకులు ఎంత ఆలోచిస్తే సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది అని సినిమా వాళ్ళ నమ్మకం. అయితే ఆ దారిలోనే తాను నటిస్తున్న ఒక మనసు సినిమా గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ పెట్టారు. చిత్ర విచిత్రమైన ప్రశ్నలతో మెగా డాటర్ నిహారికను కన్ ఫ్యూజ్ చేసిన అభిమానులు ఆమె తెలివితేటలకు ఫిదా అయిపోయారు.
ఓ వీరాభిమాని ఫ్లయింగ్ కిస్ అడిగిన సందర్భంగా.. తాను ఇవ్వడానికి రెడీనే కాని ఆ స్పీడ్ కు నువ్వ్ ఎగిరిపోవడం నాకు ఇష్టం లేదు అంటూ తెలివిగా సమాధానం చెప్పి వారెవా అనేలా చేసింది నిహారిక. ఇక తన అన్న వరుణ్ తేజ్, పెద్దన్నయ్య చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని.. వారే తనకు సపోర్ట్, గైడ్ అని అంటుంది. అవకాశం వస్తే నాన్న, పెదనాన్న మెగాస్టార్ చిరంజీవిలతో కూడా కలిసి చేస్తా అంటుంది నిహారిక.
ఇక చివరగా వాటర్ తాగినా అది ఓడ్కానా అడిగిన వింత ప్రశ్నకు కూడా తనకు ఎలాంటి అలవాట్లు లేవని అసలు తన సౌదర్య రహస్యం నీళ్లు తాగడమే అన్నది. ఒక మనసు అంటూ వస్తున్న నిహారిక ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో లేదో చూడాలి. ఇప్పటికే వెబ్ సీరీస్ గా వస్తున్న ముద్దపప్పు ఆవకాయ్ తో యూత్ ఆడియెన్స్ ను తన గ్రిప్ లో పెట్టుకున్న ఈ అమ్మడు మొదటి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో మరి.