సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పీకర్గా ఎన్నిక కావడం లాంఛనమే. ఆయన తరపున కూటమి నేతలంతా నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీకి నామినేషన్ వేసే బలం కూడా లేదు కాబట్టి అలాంటి ఆలోచన చేయలేదు. ఒక వేళ ఉంటే చేసి ఉండేది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడును స్పీకర్ గా జగన్మోహన్ రెడ్డి అసలు అంగీకరించలేరు. పదవిలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ ఆయనపై పగతో రగిలిపోయారు. అరెస్టు చేయాలనుకుని చేయాల్సినదంతా చేయించారు.
ఓ సారి రెండు గంజాల స్థలం ఆక్రమణ అంటూ అర్థరాత్రి ఇళ్లపై పడ్డారు. అరెస్టు చేసి తీసుకుపోయారు. కానీ కోర్టు రిమాండ్ కు ఇవ్వలేదు. ఓ సారి విమానాశ్రయం నుంచి పట్టుకుపోయారు. దారి మధ్యలోనే వదలాల్సి వచ్చింది. ఆయన కుమారుడ్ని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ లో ఓ సారి దొంగల ముఠాల మాదిరిగా చొరబడ్డారు. అయినా విజయం సాధించలేకపోయారు. ఐదేళ్లలో ఆయనను కానీ ఆయన కుటుంబాన్ని కానీ అరెస్టు చేయడానికి చేయని ప్రయత్నమే లేదు. కానీ సక్సెస్ కాలేకపోయారు.
అయితే అయ్యన్న ఎప్పుడూ తగ్గలేదు. విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని.. ఆయనను రాజకీయంగా చచ్చే వరకూ కొట్టాలని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు విని జగన్ కూడా తన పార్టీ నేతలకు చెప్పుకున్నారు. అలాంటాయన స్పీకర్ గా వస్తున్నారంటే మన వెళ్లి ఏమీ చేయలేమని చెప్పుకొచ్చారు.
సాధారణంగా స్పీకర్ ను ప్రతిపక్ష నేత కూడా అందరితో పాటు చెయిర్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. జగన్ అలా కూర్చోబెట్టే అవకాశాలు లేవు. పెద్దిరెడ్డిని అయినా పంపుతారా లేకపోతే అసలు వద్దనుకుంటారా అన్నది రేపు తేలనుదంి. వైసీపీ పదకొండు మంది సభ్యులూ ప్రమాణం పూర్తి చేశారు.