ముఫ్పై ఏళ్లు అధికారంలో ఉంటామని తమను ఎవరూ ఆపలేరన్న నమ్మకంతో వైసీపీ నేతలు ప్రభుత్వం తమ చేతుల్లో ఉన్నప్పటికీ కనీస అనుమతులు కూడా తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వైసీపీ ఆఫీసుల్ని నిర్మించుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు అధికారం పోవడంతో వాటి కూల్చివేతకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మొదట తాడేపల్లిలో ప్రభుత్వ స్థలంలో పిల్లర్లు వేసిన భవనాన్ని కూల్చేశారు.
తాడేపల్లిలో అత్యంత ఖరీదైన రెండు ఎకరాల భూమిని ఎకరం వెయ్యి చొప్పున లీజుకుు ఇచ్చేసుకున్నారు వైసీపీ నేతలు. అందులో నిర్మాణాలు ప్రారంభించారు. కానీ వేగంగా నిర్మించలేదు. ఎలాంటి అనుమతులు కూడాతీసుకోలేదు కొద్దిగా పిల్లర్లు లేపారు. అవి కూడా కూల్చేస్తారన్నభయంతో హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. నిబంధనల ప్రకారమే అన్ని లాంఛనాలు పూర్తి చేసి కూల్చివేసింది.
వైసీపీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. పాలన కోసం ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడానికి చిన్న ప్రయత్నం చేయలేదు., కానీ వైసీపీ ఆఫీసుల కోసం మాత్రం… ప్రతి జిల్లాలోన రెండు ఎకరాలు కేటాయింప చేసుకున్నారు. అత్యంత ఖరీదైన స్థలాలను ఎడాదికి రూ. వెయ్యి చొప్పున లీజుకు కేటాయింప చేసుకున్నారు. విశాఖలో ఎలాంటి ప్లాన్లు లేకుండా శరవేగంగా నిర్మాణాలు కూడా పూర్తి చేసుకున్నారు. కాపు కార్పొరేషన్ కు కేటాయించిన స్థలాలు సహా దేన్నీ వదల్లేదు.
అక్రమంగా లీజుకు తీసుకోవడమే కాదు… వాటిలో భవనాలకు అనుమతులు తీసుకోకపోవడంతో ఇప్పుడు వాటికి కూల్చివేత ముప్పు పొంచి ఉంది. విశాఖలో దాదాపుగా వంద కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భవనానికి ఒక్క అనుమతి కూడా లేదు. రాత్రికి రాత్రి అనుమతి తీసుకునేందుకు చేసిన కుట్రలు ఫెయిలయ్యాయి. ఆ భవనాన్ని కూల్చేస్తారా .. సీజ్ చేస్తారా అన్నది ముందు ముందు తెలుస్తుంది.