తాడేపల్లిలో మత్స్యకారుల భూమి కొట్టేసి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీసును మొదట్లోనే కూల్చేశారు. దీనిని కూల్చేస్తారని వైసీపీకి సమాచారం ఉంది. అందుకే రాత్రికి రాత్రి హైకోర్టుకు వెళ్లారు. లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారమే చేయాలని హైకోర్టు చెప్పింది. కూల్చివేయడం నిబంధనల ప్రకారమే జరుగుతుందని తెలుసు. కానీ వైసీపీ ఆఫీసు దగ్గరకు కనీసం డ్రామా చేయడానికైనా కొంత మంది కార్యకర్తల్ని పిలిపించలేకపోయారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాటిలో మాస్టర్ అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పార్టీ ఆఫీసు వద్దకు రాలేదు.
ఏదైనా పార్టీ ఆఫీసు కూల్చివేస్తూంటే చాలా మంది వస్తారు. సడెన్గా చేసినా ఇప్పటికప్పుడు పోగవుతారు. కనీసం ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చిన అవకాశాన్ని అయినా అందుకునే ప్రయత్నం చేస్తారు. తాడేపల్లి పార్టీ ఆఫీసు కూల్చివేత సమయంలో అలాంటిదేమీ లేదు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఆ స్థలాన్ని పార్టీ ఆఫీసుకు కేటాయించడంలో కీలక పాత్ర పోషించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అక్కడకు రాలేదు.
ఐదేళ్లు తాము చేసిన నిర్వాకాలు ఇప్పుడు తమకు రివర్స్ అవుతాయని అక్కడికి వెళితే ఖచ్చితంగా కేసులు పెట్టేస్తారని భయంతో అందరూ ఆగిపోయారు. వైసీపీ కోసం కేసులు పెట్టించుకుని రోడ్డున పడితే పట్టించుకునేవారు ఉండరని క్యాడర్ కు ఐదేళ్లలో తేలిపోయింది. అందుకే ఒక్కరు కూడా రాలేదని చెబుతున్నారు.. రేపు అనుమతుల్లేకుండా విశాఖలో నిర్మించిన పార్టీ కార్యాలయం కూల్చివేసినా ఒక్కరూ రారు. వైసీపీ పరిస్థితి అలా మారింది.