సభా సంప్రదాయాల్ని పాటిస్తానని జగన్ రెడ్డి ప్రమాణం చేసి ఒక్క రోజు కూడా కాలేదు… ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించేశారు. స్పీకర్ ను అన్ని పార్టీల నేతలు చెయిర్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి నాలుగు మంచి మాటలు చెప్పడం సంప్రదాయం. కానీ జగన్ రెడ్డి దాన్ని ఉల్లంఘిస్తున్నారు. ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా వెళ్లిపోయిన ఆయన… రెండో రోజు సభకు రాకుండా పులివెందులకు వెళ్లిపోతున్నారు. స్పీకర్ ఎన్నిక ఉందని తెలిసినా.. ఆయన వెళ్లిపోతున్నారు.
సభా సంప్రదాయాలు ముఖ్యం. తమ్మినేని స్పీకర్ గా ఆయన ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. అయినా సరే టీడీపీ అధినేత చంద్రబాబు స్పీకర్ ఎంపిక కార్యక్రమంలో భాగం అయ్యారు. ఆయనను చెయిర్ వరకూ తీసుకెళ్లే కూర్చోబెట్టే సంప్రదాయాన్ని పాటించారు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డికి మాత్రం అలా చేయాలని అనిపించడం లేదు. ఆయన రాకపోతే పార్టీ నేతల్ని అయినా పంపిస్తారేమోనని అనుకుంటున్నారు.
వైసీపీలో సీనియర్ నేత పెద్దిరెడ్డి ఉన్నారు. ఆయన అయినా అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని టీడీపీ కోరుతోంది. అయితే జగన్ కు ఇష్టం లేదు కాబట్టి .. అసలు వైసీపీ సభ్యులెవరూ హాజరయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు. ఇలా ఒక్క రోజులోనే సంప్రదాయాల్ని పాటిస్తానని చేసిన ప్రమాణాన్ని జగన్ ఉల్లంఘించారు.