వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత బేగంపేటలో సీఎం క్యాంపాఫీస్ పేరుతో ఆయన కట్టుకున్న ఇంట్లో ఆయన ఫ్యామిలీ నెలల తరబడి ఉంది. జగన్ కానీ.. విజయలక్ష్మి కానీ ఖాళీ చేయాలన్న ఆలోచనకు రాలేదు. రోశయ్య సీఎంగా ఉన్నంత కాలం ఆయన సొంత ఇంటి నుంచే పాలన చేశారు. కానీ బేగంపేట కార్యాలయం సీఎం క్యాంపాఫీస్ దాన్ని ఖాళీ చేయాలని అనుకోలేదు. పాపం బాధల్లో ఉన్నారులే అని…. రోశయ్య కూడాతన కష్టం తానుపడ్డారు.
అయితే ఎన్నాళ్లకూ ఖాళీ చేసేలా లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక.. బలవంతంగా ఖాళీ చేయిస్తారన్న సిగ్నల్స్ రావడంతో అప్పుడు సర్దుకున్నారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎంగా రాజీనామా చేసి.. ప్రతిపక్ష నేతగా కూడా హోదా లేకపోయినా సీఎం కాన్వాయ్ ను వాడేస్తున్నారు. కనీసం పది లాండ్ క్రూయిజర్ కార్లు, అంబులెన్స్, జామర్లతో ఆయన పర్యటనలు కొనసాగించేస్తున్నారు. సీఎంగా ఓడిపోయాక ఇంట్లో నుంచి బ యటకు రాలేదు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికే వచ్చారు. అప్పుడు కాన్వాయ్ లోనే వెళ్లారు.
శనివారం పులివెందులు కూడా అలాంటి కాన్వాయ్ లోనే వెళ్లారు. కాన్వాయ్ తీసేసుకుంటే… భద్రత తగ్గించారని అవమానించారని ఆరోపణలు చేయవచ్చునని.. తీసుకోకపోతే.. వాడుకోవచ్చని జగన్ ప్లాన్ వేసుకుంటున్నట్లుగా అధికారవర్గాలు భావిస్తున్నాయి. మామూలుగా అయితే ప్రజలు తిరస్కరించిన తరవాత అన్నీ ప్రభుత్వానికి సరెండర్ చేసేయాలి. కానీ జగన్ మాత్రం అలాంటి వాటికి అతీతం. తనవే అని నిస్సిగ్గుగా వాడేసుకుంటూ ఉంటారు. ఎంతో చెబితే ముష్టి పడేస్తామని నోటిదూల నేతలతో చెప్పిస్తూంటారు.