ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో వైసీపీ అభ్యర్థులు బయటపడుతున్నారు. దానికి కారణాలను బయట పెట్టేందుకు వెనుకాడటం లేదు. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. మద్యం పేరుతో పేద ప్రజల రక్తాన్ని పీల్చామని అందుకే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. మద్యం విధానాన్ని మార్చాలని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోలేదన్నారు. మద్యం తాగేవాళ్లు ఎవరూ వైసీపీకి ఓటేయలేదన్నరు.
అలాగే ఇసుక విషయంలోనూ తేడా జరిగిందని… పేద వర్గాలు నష్టపోయాయని ఉపాధి లేకపోవడం వల్ల పేదలుకూడా ఓటు వేయలేదన్నారు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్లు చేసిన బూతు వ్యాఖ్యల వల్ల టీడీపీలో. వారి క్యాడర్ లో కసి పెరిగిందని .. ఎవరిని అవమానాలకు గురి చేసినా వారిలో కసి పెరుగుతుందని చరిత్ర చెప్పిందని ఆయన చెప్పుకొచ్చారు.
నిజానికి మహేష్ రెడ్డి చెప్పినవన్నీ అందరూ చెప్పేవే. కానీ అసలు వినిపించుకోనిది జగన్ రెడ్డి.. సజ్లల రెడ్డినే. అంతా ఈవీఎంల వల్లే ఓడిపోయామని వారు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ప్రజల్లో మనపై ఇంకా అభిమానం ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్లు నిజాలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు.