పాడి కౌశిక్ రెడ్డి నిన్నటిదాకా రెడ్ బుక్ అన్నారు. కానీ లోకేష్ ఫాలో అవుతున్నానని అనిపించిందేమో.. ఇంకా బోలెడన్ని కలర్లు ఉన్నాయి కదా అని… రూటు మార్చేశారు. ఇప్పుడు బ్లాక్ బుక్ పట్టుకొచ్చేస్తున్నారు. అధికారుల్ని బెదిరించేందుకు ఆయన బ్లాక్ బుక్ ను చూపిండం ప్రారంభించారు. బీఆర్ెస్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి కొంత మంది ఆఫీసర్లు రెచ్చిపోతున్నారని వారి పేర్లు బ్లాక్ బుక్ లో రాస్తున్నామని తాము రాగానే వారందర్నీ బ్లాక్ లిస్టులోకి పంపుతామని హెచ్చరిస్తున్నారు.
“రూల్స్ ప్రకారం ముందుకెళ్లండి. అందుకు వ్యతిరేకంగా వ్యవహరించే అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టారాజ్యాంగా వ్యవహరించే అధికారులను హెచ్చరిస్తున్నాను. మీలాంటి వాళ్ల కోసమే బ్లాక్ బుక్ ను సిద్ధం చేశా. ఇందులో పేర్లు రిజిస్టర్ చేస్తున్నాను. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.మా పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బ్లాక్ డేస్ ఉంటాయి” అని కౌశిక్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.
పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఒకరిద్దరు ఎంఎల్ఏ లు పోతే పార్టీకి వచ్చే నష్టం ఏం లేదన్నారు. గతంలో కూడా ఇలా జరిగిందని.. అయినప్పటికీ బీఆర్ఎస్ నిలబడి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కేసీఆర్ ను మోసం చేస్తున్న ఏ ఒకర్ని వదలిపెట్టామని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ మారే ఆలోచన ఉన్నవారు పునరాలోచన చేయాలని కోరారు.