పులివెందుల నుంచి జగన్ రెడ్డి తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కు రావడం లేదు. అలాగని లోటస్ పాండ్కూ రావడం లేదు. బెంగళూరు వెళ్లిపోతున్నారు. ఊరూరా ఆయన రేంజ్ కు తగ్గ ప్యాలెస్‌లు ఉన్నాయి. యలహంకలో దాదాపుగా పాతిక ఎకరాల స్థలంలో ప్యాలెస్ ఉంది. కానీ ఎప్పుడూ ఉండలేదు. మొదటి సారి అక్కడ ఎక్కువ కాలం స్టే చేసే అవకాశాలు ఉన్నాయి.
ఏపీలో ఓడిపోవడంతో ఆయన తాడేపల్లిలో ఉంటారని ఎవరూ అనుకోవడం లేదు. అక్కడ ఆయన భయం భయంగా ఉంటున్నారు. కనీసం వంద మంది ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకుని ఓడిపోయిన తర్వాత బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్నారు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి మాత్రమే బయటకు వచ్చారు. ఇక రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నందున ఆయన హైదరాబాద్ లో ఉండేందుకు కూడా ఇష్టపడరని ఆయన మనస్థత్వం తెలిసిన వారు చెబుతారు. దానికి తగ్గట్లే ఆయన బెంగళూరుకు వెళ్తున్నారు.
కర్ణాటకలో బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ అక్కడి పెద్దలు జగన్ మోహన్ రెడ్డికి కాస్త పరిచయస్తులే . అందుకే జగన్ అక్కడ కాస్తం సేఫ్ ఫీలవుతారని భావిస్తున్నారు. మళ్లీ ఏపీకి ఎప్పుడు వస్తారన్నదానిపై స్పష్టత లేదు. అసెంబ్లీ సమవేశాలకు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఒక ఐదారు నెలలు ఆయన సైలెంట్ గా ఉండవచ్చని చెబుతున్నారు.