రెండుకిలో మీటర్ల దూరాన్ని హెలికాఫ్టర్ లో వెళ్లేందుకు నాలుగు వందల కిలమీటర్ల దూరం నుంచి హెలికాఫ్టర్ ను తెప్పించుకునే రేంజ్ నుంచి ఇప్పుడు రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని అది కూడా … గోతులతో నిండిపోయిన పులివెందుల – కదిరి రోడ్డు మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితికి జగన్ వచ్చారు. ఐదు రోజులు ఉండాలనుకున్న పులివెందులలో రెండు రోజులు ఉన్న ఆయన… బిల్లుల గోలతో సొంత పార్టీ నేతలు రోజూ పంచాయతీ పెడుతూంటే.. ఉండటం కష్టమని బెంగళూరుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
సాధారణంగా పదవి పోయినా ప్రత్యేక విమానం అందుబాటులోకి తెచ్చుకోగల రేంజ్ ఆయనది. ఇప్పటి వరకూ అత్యంత విలాసవంతమైన విమానాల్లోనే ప్రయాణించారు. అయితే ఈ సారి ఎందుకో ఆయన విజ్ఞప్తికి ఎవరూ స్పందించినట్లుగా లేరు. కనీసం హెలికాఫ్టర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. కడప నుంచి బెంగళూరుకు జగన్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి మరీ ఫ్లైట్లు ఏర్పాటు చేశారు. అందులో అయినా వెళ్లవచ్చు. కానీ ఆ ఫ్లైట్లలో వెళ్లడం కన్నా రోడ్డు మార్గం ద్వారానే త్వరగా చేరుకుంటారు. అవి వన్ స్టాప్ ఫ్లైట్లు. మొదట చెన్నైకు వెళ్లి ఆ తర్వాత బెంగళూరు వెళ్తాయి. కనీసం నాలుగు గంటలు పడుతుంది.
ఈ బాధలన్నీ ఎందుకనుకున్నారో కానీ మధ్యాహ్నం రోడ్డు మార్గం ద్వారా బెంగళూరుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కదిరి – పులివెందుల రోడ్డు ఘోరంగా ఉంటుంది. అయినా సరే.. ఎలాగోలా వెళ్లిపోవాలని డిసైడయ్యారు. అధికారం ఉన్నప్పుడే సాగదీసుకోగలరు కానీ.. అధికారం పోయాక తప్పదు. అందుకే అధికారం శాశ్వతమని విర్రవీగకూడదని పెద్దలు చెబుతారంటారు.