ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ ప్రభుత్వంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారని ఎలాంటి టార్చర్ పెట్టారో ఆయన మీడియా ముందుకు వచ్చి ఆదివారం గోడు వెళ్లబోసుకున్నారు. పాలక మాఫియాబారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ఆయనకు చంద్రబాబు సాయం చేశారు. గతంలో ఇదే సూర్యనారాయణ జగన్ ను అభిమానించారు… చంద్రబాబు అత్యధిక ఫిట్ మెంట్ ఇచ్చినా విమర్శించారు. అవేమీ మనసులో పెట్టుకోకుడా మాఫియా నుంచి ఆయనను చంద్రబాబు కాపాడారు. తాను ఎలాంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో సూర్యనారాయణ చెప్పుకున్నారు.
ఆయన ఒక్కరేనా ?. స్కిల్ స్కాంలో చంద్రబాబును ఇరికించడానికి తప్పుడు కేసులు పెట్టించడానికి సుమన్ బోస్ అనే కార్పొరేట్ ప్రముఖుడి పక్కన శవాన్ని పెట్టి విచారించేంత కర్కశత్వం అప్పటి పాలకుల్లో ఉందంటే… సూర్యనారాయణకు జరిగింది చిన్నదే. రఘురామకు ధర్డ్ డిగ్రీ ఇచ్చి వీడియోకాల్స్ చేయించుకుని చూసేంత వికృతం వారికి ఉంది. తెలిసినవి కొన్నే. కానీ తెలియనిని ఎన్ని ఉన్నాయో… ఆ బాధలు పడిన ఐపీఎస్, ఐఏఎస్ వర్గాలందరికీ తెలుసు. వారి మీద వారికే ఎగదోసి .. మంచి, మానవత్వం లేని రాజకీయం చేసిన మాఫియా పాలనలో ఘోరమైన పరిస్థితుల్ని చూశారు.
బాధితులంతా ఇప్పుడు బయటకు వచ్చి చెబితే.. చాలా మంది ఆశ్చర్యపోతారు. నమ్మలేకపోతారు. చెప్పుకుని ప్రయోజనం ఏముందని.. తర్వాత ఏమవుతుందోనని భయపడేవారు కూడా ఉంటారు. ఇలాంటి ఆకృత్యాల్లో ముఖ్యభాగం పీఎస్ఆర్ ఆంజనేయులుది. ఐపీఎస్ అధికారిగా ఇంటలిజెన్స్ చీఫ్ గా ఆయన చేసిన అరాచకాల వల్ల తోటి అధికారులు కూడా నలిగిపోయారు. డీజీపీ పదవి వస్తుందన్న ఒకే ఒక్క ఆశతో మాఫియాతో చేతులు కలిపారు. ఈ అరాచకాలన్నీ ఒకటి తర్వాత ఒకటి బయటకు రావాల్సిందే. చేసిన పాపాలకు ఫలితం అనుభవించాల్సిందే.