జగన్ అడుగేస్తే ప్యాలెస్ అనే మాటే వినపడుతోంది. తాజాగా ఆయన బెంగళూరుకు మకాం మార్చారు. ఒకటి రెండు రోజుల టూర్ అయితే అదే చెప్పేవారు. కానీ ఎన్ని రోజులు ఉంటారో చెప్పుకుండానే బెంగళూరు చేరుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటారన్న ఆసక్తి చాలా మందిలో వ్యక్తమవుతోంది. దానికి తగ్గట్లే ఆయన యలహంక ప్యాలెస్ ట్రెండింగ్ లోకి వచ్చింది.
బెంగళూరు నుంచి ఏపీకి లేదా హైదరాబాద్ కి వచ్చే రూట్లో యలహంక ఉంటుంది. ఎయిర్ పోర్టుకు దగ్గర. ఆ యలహంకలో జగన్ దాదాపుగా ముఫ్ఫై ఎకరాల్లో ప్యాలెస్ కట్టించుకున్నారు. అప్పటికి ఆయన రాజకీయాల్లోకి రాలేదు. సీఎం గా వైఎస్ ఉన్నారు. జగన్ ను బెంగళూరుకే పరిమితం కావాలని వైఎస్ ఆదేశించారని ప్రచారం జరిగిన తర్వాత ఆ ప్యాలెస్ రెడీ చేయించుకున్నారు. బహుశా.. వైఎస్ చనిపోకపోతే ఆయన అక్కడే ఉండేవారేమో. తర్వాత మళ్లీ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లకు ఆ అవసరం వచ్చింది.
ఆ ప్యాలెస్ పక్కన హెలిప్యాడ్ ఉంటుంది. ఆ ప్యాలెస్ వైభోగం గురించి అప్పట్లో కథలుకథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు మరోసారి యలహంక ప్యాలెస్ గురించి అందరూ వివరంగా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. జగన్ అంటే ప్యాలెస్లు… రోజుకో ప్యాలెస్ కథలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదంతా ప్రజల ఆస్తి.. లేకపోతే అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులే కావడం .. అసలు ట్విస్ట్.