ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును అవమానంగా భావించి ప్రజలకు మొహం చూపించేందుకు ఇష్టపడని కేసీఆర్ లాగే, జగన్ కూడా ప్రజలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు భిన్నంగా ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ కొంత హడావిడి చేసినప్పటికీ ఇక నుంచి కొద్ది రోజుల వరకు ప్రజలకు మొహం చూపించకూడదని ఫిక్స్ అయినట్లు కనబడుతోంది.
ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌజ్ ను అంటిపెట్టుకొని ఉంటే, జగన్ రెడ్డి మాత్రం ప్యాలెస్ లో ఉండేందుకు బెంగళూర్ కు మకాం మార్చారు. అక్కడ జగన్ ఎన్ని రోజులు ఉంటారో పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో చాలారోజులపాటే ఆయన బెంగళూరులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికప్పుడు జగన్ జనాల్లోకి వెళ్తే ఆయనను స్వాగతించడం అటుంచితే ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితులు ఉన్నాయి.
ఇదే జరిగితే పార్టీ మరింత అప్రతిష్టపాలు అవుతుంది. పార్టీ కోసం కార్యక్రమాలు చేపట్టినా ఫెయిల్ అవుతాయోమోనని ఆందోళన జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే కొద్ది కాలంపాటు జనబాహుళ్యంలోకి వెళ్ళడం మానేసి ఎంచక్కా కేసీఆర్ తరహాలోనే ప్యాలెస్ లో సేదా తీరాలని జగన్ తాజాగా మకాం మార్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.