జగన్ పై ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు తిరగబడితే ఏ స్థాయిలో పతనం వుంటుందో ఈ ఎన్నికల్లో ప్రత్యేక్షంగా కనిపించింది. ఇది ప్రజా విజయమని అందరూ పండగ చేసుకునే సందర్భం ఇది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా అలానే ఫీలయ్యారు. కూటమి విజయాన్ని ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలాంటి పార్టీలు ప్రైవేట్ గా జరుగుతాయి. కానీ ఆయన మాత్రం లైవ్ ఇచ్చారు. తన ప్రొడక్షన్ లో పని చేసిన వారితో పాటు ఇండస్ట్రీలో చాలా మందిని ఇన్వైట్ చేశారు.
ఈవెంట్ బాగానే జరిగింది కానీ పరిశ్రమ నుంచి రావాల్సిన చాలా మంది కనిపించలేదు. మారుతి, ఎస్కేన్, హైపర్ అది లాంటి జనసేన వీర అభిమానులు తప్పితే పెద్ద ముఖాలు కనిపించలేదు. పైగా వచ్చిన వారిలో చాలా మంది స్టేజ్ పైకి రాలేదు. తేజసజ్జా లాంటి కుర్ర హీరో కనిపించారు కానీ అంటిముట్టనట్టుగా వెళ్లారు.
పరిశ్రమకు చెందిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు, కనీసం ఆయనకు అభినందనలు చెప్పడానికైన ఇది మంచి వెదికే. నిజానికి ఇలాంటి పార్టీలు ప్రైవేట్ గా జరిగితే చాలా మంది ప్రముఖులు కనిపిస్తారు. లైవ్ అనే సరికి చాలా మందిలో లేనిపోనీ భయాలు వచ్చాయని ఇన్ సైడ్ టాక్. ఏదేమైనా ఇలా పబ్లిక్ గా ఎన్నికల విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న టీజీ విశ్వప్రసాద్ గట్స్ ని మెచ్చుకోవాల్సిందే.