లోక్సభ స్పీకర్ ఎన్నిక ఓటింగ్ వరకూ వెళ్లలేదు. మూజువాణి ఓటుతో ముగిసిపోయింది. అంతకు ముందు రోజు భారీ హడావుడి జరిగింది. పార్టీలన్నీ విప్లు జారీ చేశాయి. బీజేపీ తమను సపోర్ట్ అడిగిందని తాము అన్నామని వైసీపీ జాతీయ మీడియాకు లీకులిచ్చింది. దాంతో అందరూ ఆ పార్టీ వైపు వింతగా చూశారు. టీడీపీ, జనసేన ఉన్న కూటమికి మద్దతిస్తున్నామని చెప్పుకోవడం ఏమిటని.. ఆశ్చర్యపోయారు. అందరూ జగన్ తీరుపైనే చర్చించుకున్నారు. ఇంత వెన్నుక లేని రాజకీయం చేస్తున్నారా అని ఆశ్చర్యపోయారు.
తీరా పార్లమెంట్ లో ఓటు వేయాల్సిన అవకాశం రాలేదు. అనవసరంగా ముందే బీజేపీకి మద్దతు ఇచ్చామని లీక్ చేసి కామెడీ అయిపోయాం కదా అని వైసీపీ ఎంపీలు గొల్లుమనే పరిస్థితి. అంతేనా.. స్పీకర్ ఎన్నిక జరగగానే .. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పీకర్ ను చెయిర్ వద్దకు తీసుకెళ్లారు. ఇది వైసీపీని మరింత ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే అసెంబ్లీలో జగన్ చేసిన నిర్వాకం అందరికీ గుర్తు వస్తుంది మరి. ఏం చేయాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయారు.
వైసీపీ రాజకీయ వ్యూహాలు పరువు తీసేలా ఉంటున్నాయి. కనీసం గౌరవాన్ని నిలుపుకునేలా.. హుందా తనాన్ని పెంచుకునేలా ఉండటం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న లగేజీ అధికారం ఉందని.. అన్ని వ్యవస్థలపై చేసిన దాడి ఇప్పుడు ఆయనను వెంటాడుతున్నాయి. భయంతో ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఎలాంటి లేఖలు రాస్తారో తెలియని పరిస్థితికి వెళ్లిపోతున్నారు.