గ్రీన్ కో సంస్థ చేపడుతున్న సంప్రదాయేతర ఇంధన వనరుల ప్లాంట్ల ఏర్పాటులో జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలపై .. పర్యావరణ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ గ్రీన్ కో ఎవరిదో కాదు.. చలమలశెట్టి సునీల్ కుటుంబానికి చెందినది. వైఎస్ జగన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా అటవీ భూముల్ని కూడా అక్రమించి పనులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డికి బినామీ వాటాలు ఇచ్చారని.. అందుకే పెద్ద ఎత్తున భూములు కేటాయించారన్న గుసగుసలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూంటారు చలమలశెట్టి సునీల్. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరారు. నాలుగు సార్లు కాకినాడ నుంచి పోటీ చేసి నాలుగుసార్లూ ఘోరంగా ఓడిపోయారు. ఆయనకు కాలం కలసి రావడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పినా వైసీపీ అధినేత జగన్.. బెదిరింపులతో కూడిన హెచ్చరికల ద్వారా పోటీ చేయించారని చెబుతున్నారు.
ఎన్నికలు ముగిసిన వెంటనే చలమలశెట్టి సునీల్ జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే పవన్ చేర్చుకునే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది. అందుకే గ్రీన్ కో అక్రమాలపై ప్రత్యేకమైన నివేదిక అడిగారని అంటున్నారు.