టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ప్రవేశించింది. ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ 60 పరుగుల భారీ తేడాతో గెలిచి.. ఫైనల్లో దర్జాగా అడుగుపెట్టింది. ఆఫ్గనిస్థాన్పై గెలిచిన సౌత్ ఆఫ్రికా.. ఇప్పటికే ఫైనల్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో.. ఈ ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాతో తలపడబోతోంది. ఇప్పటి వరకూ భారత్ ఒక టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. సౌత్ ఆఫ్రికా.. ఓ ఐసీసీ ట్రోఫీ ఫైనల్ లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.
గయానాలో జరిగిన రెండో సెమీ ఫైనల్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్ ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 171 పరగులు చేయగలిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అద్భుతంగా ఆడి 57 పరుగులు సాధించాడు. సూర్య కుమార్ 47 పరుగులు చేశాడు. చివర్లో జడేజా ( 9 బంతుల్లో 17) ధాటిగా ఆడాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ కేవలం 103 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాంతో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫైనల్ లో అడుగు పెట్టింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, అక్షర్ పటేల్ 3, కులదీప్ 3 వికెట్లూ పడగొట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బట్లర్ (23), బ్రూక్ (25) మాత్రమే ఓ మాదిరిగా రాణించారు. ఈనెల 29న ఫైనల్ లో భారత్ సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.