తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్ గా ఉన్న సీ.పీ. రాధాకృష్ణన్ చంద్రబాబుతో అమరావతికి వచ్చి మరీ సమావేశం అయ్యారు. ఆయనది మర్యాదపూర్వక భేటీ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయం లేదని అంటున్నాయి. అయితే తెలంగాణ గవర్నర్ మర్యాదపూర్వక భేటీలు నిర్వహించడానికి ఏపీకి వస్తారా అన్న డౌట్ మాత్రం రాజకీయవర్గాల్లో ఉంది. గతంలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం సమయంలోనూ తెలంగాణ గవర్నర్ చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పుడు పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోయినందున ఇప్పుడు మరోసారి అమరావతి వచ్చి మరీ కలిసినట్లుగా తెలుస్తోంది.
సీపీ రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ గా కూడ ాఉన్నారు. ఆయ్ అసలుకు జార్ఖండ్ గవర్నరే. తెలంగాణ గవర్నర్ తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఖాళీ అయింది కనుక.. జార్ఖండ్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ గవర్నర్ ను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు ఆయన చంద్రబాబుతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారుతోంది.
సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీ నాయకుడు. ఆయన గవర్నర్ గా తెలంగాణలోనే కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే దానికి చంద్రబాబుతో చర్చించాల్సిన పని లేదు. అంతా కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ పెద్దల చేతుల్లో ఉంటుంది. అసలు ఏపీ గవర్నర్ తోనే చంద్రబాబు ఇంత సేపు కాలేదు.. తెలంగాణ గవర్నర్ తో రాజకీయాలు ఏమి ఉంటాయబ్బా అని.. అన్ని పార్టీల నేతలూ ఉత్కంఠకు గురవుతున్నారు. రాజకీయాలపై చర్చించడానికి కలవలేదని సీపీ రాధాకృష్ణన్ కూడా చెబుతున్నారు.