హాస్య నటుడు అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు.
‘సినిమా పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. ఒకొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాను. నిర్మాత డి.రామానాయుడు కోసం టీడీపీ హయాంలో 1999లో రాజకీయాల్లో అడుగుపెట్టా. పది మందికి సాయపడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. మా నాన్న గారితో పేరుతో ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి సేవ చేశాను” అని చెప్పుకొచ్చారు
‘నేను ఏ పార్టీలో వున్నా వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదు. ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఏ పార్టీ సపోర్ట్ ని కాదు. ఓ సామాన్యుడిని మాత్రమే. ఓ కామన్ మ్యాన్ గా నా సినిమాలు, షూటింగులు చేసుకుంటాను . ఇక రాజకీయాలకు స్వస్తి’ అని ప్రకటించారు అలీ.
అలీ గత కొంతకాలంగా వైసీపీ సపోర్టర్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో వున్నప్పుడు కూడా ఆయనకి తగిన ప్రతిఫలం దక్కలేదు. ఎదో గౌరవ సలహాదారు పోస్ట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అయినా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశపడ్డారు. కానీ ఈసారి మొండిచేయే చూపారు జగన్. ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం చూసింది వైసిపీ. దీంతో అలీ ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు.