ప్రపంచ కమ్మ మహాసభకు హైదరాబాద్ కు వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్లోని హెచ్ఐసీసీ లో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు.
దేశ జనాభాల్లో 1.5 శాతం, ప్రపంచవ్యాప్తంగా 2.1కోట్ల మంది కమ్మ సామాజికతరగతుల వారు వర్గీయులు ఉన్నారని, వీరందరినీ ఒక వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జెట్టి కుసుమకుమార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేశారు. రేవంత్ రెడ్డిక ిసన్నిహితుడుగా పేరుంది. ఆయన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో కుసుమకుమార్ చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు పాల్గొంటే… ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించే మొదటి కార్యక్రమం అవుతుంది. వీరిద్దరూ ఇప్పటి వరకూ ఒకే వేదికపై కనిపించలేదు.