ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ కిందా మీదా పడుతున్నారు. ఆయన ఎన్ని లేఖలు రాసినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఒకే ఒక్క మార్గం ద్వారా మాత్రమే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా వస్తుంది. ఆ మార్గం.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆయన రూలింగ్ ఇస్తే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది. ఈ విషయం తెలుసు కాబట్టే స్పీకర్ కు జగన్ లేఖ రాశారు. కానీ ఆ లేఖలో ఆయన చెప్పిన విషయాలే తేడాగా ఉన్నాయి.
పది శాతం సీట్లు సాధిస్తేనే.. ప్రతిపక్ష నేత హోదా వస్తుందని ఇప్పటి వరకూ అనేక సార్లు రుజువు అయింది. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లుగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడం .. సుప్రీంకోర్టుకు వెళ్లినా సానుకూల ఫలితం రాకపోవడంతో అంత కంటే లోతుగా అకడమిక్ చర్చకు వెళ్లలేదు. జగన్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉండదని నిర్ణయానికి వచ్చేశారు. పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి వచ్చినట్లయిందే.. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి వైఎస్సార్సీపీ అధినేత లేఖ రాయాల్సిన అసరమే ఉండేది కాదు.
ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుకంటే ఇవ్వొచ్చు. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు వికృత చేష్టలకు పాల్పడ్డారు. పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య నియమాలు పాటించలేదు. ప్రజాస్వామ్య సూత్రాలను ఆచరించలేదు. అందుకే ఆయనకు ఎందుకివ్వాలని టీడీపీ భావిస్తోంది. ఇంకా వ్యక్తిగతంగా అయ్యన్నను వేధించారు. ఆయన రగిలిపోతున్నారు. జగన్ కు హోదా ఇచ్చి తమ నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి తెచ్చుకుంది జగనే. రాజకీయాల్లో ఎలా ఉండకూడదో జగన్ ఉదాహరణ.