ఏపీలో సెకండ్ టర్మ్ విజయం ఖాయమనుకున్నారు. పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. అన్ని అనుకూలతలే అని ఫిక్స్ అయ్యారు. మూడు పార్టీలు జతకట్టినా తమకు వచ్చిన నష్టమేమి లేదని అంచనా వేసుకున్నారు. కట్ చేస్తే.. వై నాట్ 175అని బీరాలు పలికిన వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే విజయం సాధించి అత్యంత దారుణమైన పరాభవాన్ని చవిచూసింది.
ఊహించని ఫలితాలతో జగన్ మైండ్ సెట్ ఎలా ఉండింది..? ఈ ఓటమిని అంగీకరించినా.. పార్టీ నేతలతో, తన సన్నిహిత నేతలతో జగన్ అంతర్గతంగా ఏం మాట్లాడి ఉంటారు..? అనే ప్రశ్నలకు ఆలస్యంగా సమాధానం లభించింది. పార్టీ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. ఫలితాలను చూసి జగన్ నివ్వెరపోయినట్లుగా ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయని చెబుతున్నారు.
రిజల్ట్స్ చూశాక షాక్ అయ్యా..ఈ ఫలితాలు నిజమా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా.కనీస గౌరవ ప్రదమైన స్థానాలను దక్కించుకోకపోవడంతో ఆవేదనతో గుండె పూర్తిగా బరువెక్కింది. ఉన్నపళంగా అన్ని వదిలేసి ఎంచక్కా.. హిమాలయాలకు వెళ్లాలనిపించింది. రాజకీయాలను వదిలేడ్డామా అనిపించింది.
ఓటమిపై కౌంటింగ్ రోజున స్పందించినా.. ఈ ఫలితాల నుంచి తేరుకొని బయటపడేందుకు రెండు , మూడు రోజుల సమయం పట్టింది. కానీ, అన్నీ ఆలోచన చేశా. మనకు నలభై శాతం ఓట్లు వచ్చాయంటే వైసీపీకి జనాల్లో ఆదరణ ఉన్నట్లే. ఇదొక్కటే తనకు ఊరటనిచ్చిందని.. అందుకే రాజకీయాల్లో మళ్ళీ నిలబడాలనే నిర్ణయానికి కారణం అంటూ జగన్ తన ఆవేదనను పంచుకున్నట్టు తెలిసింది. దీని బట్టి చూస్తుంటే పైకి గంభీరంగా కనిపిస్తున్నా ఫలితాలపై జగన్ గట్టి షాకే తిన్నట్లే స్పష్టం అవుతోంది.