‘కల్కి’… టాక్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చే! నాగ్ అశ్విన్ విజువలైజేషన్ గురించీ, ముఖ్యంగా అశ్వద్ధామ, కర్ణ పాత్రల గురించి బాగా మాట్లాడుకొంటున్నారు. క్లైమాక్స్ అయితే వేరే లెవల్ అంటున్నారు. క్లైమాక్స్ లో ప్రభాస్ పాత్రని పురాణాలతో లింక్ పెట్టిన సీన్ ‘కల్కి’కే హైలెట్. ప్రభాస్ ఫ్యాన్స్ కు అదో రోమాంఛిత ఘట్టంగా మిగిలిపోయింది. అప్పటి వరకూ సినిమాకు హీరో అమితాబ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం సినిమా మొత్తం ప్రభాస్ వైపు టర్న్ అయ్యింది.
నిజానికి ఈ ఐడియా ఇచ్చింది ప్రభాసేనట. షూటింగ్ ప్రాసెస్ లో ”క్లైమాక్స్ లో మంచి హై మూమెంట్ కావాలి. నా పాత్రని పురాణాలతో లింక్ చేస్తే.. ఇంకా హై వస్తోందేమో” అంటూ ప్రభాస్ దర్శకుడికి సలహా ఇచ్చాడట. అసలంతవరకూ కర్ణుడి ఆలోచనే దర్శకుడికి లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అశ్వద్ధామకు మరణం లేదని, కలియుగం వరకూ తనకు శాప విమోచన లేదని, కల్కి అవతరించాకే తనకు విముక్తి అని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఎక్కడా కర్ఱుడి ప్రస్తావన లేదు. కర్ణుడ్ని కలియుగానికి షిఫ్ట్ చేయడం కేవలం దర్శకుడి తాలుకూ సినిమాటిక్ లిబర్టీ. ఆ సలహా ఇచ్చింది మాత్రం ప్రభాసే అని తెలుస్తోంది. ప్రభాస్ ఇచ్చిన ఈ సలహా వల్ల, పార్ట్ 2కి మరింత స్పాన్ దొరికినట్టైంది. ఈ సినిమాకు ‘కల్కి’ అని పేరు పెట్టగానే ప్రభాస్ ‘కల్కి’ అవతారంలో కనిపిస్తాడని అంతా అనుకొన్నారు. కానీ నాగ్ అశ్విన్ ప్రభాస్‌ని ఓ మామూలు హీరోగానే చూపించాలనుకొన్నాడు. కానీ ప్రభాస్ సలహాతో ఆ మామూలు కమర్షియల్ హీరో కాస్త ‘కర్ణుడు’గా మారిపోయాడు.