వైసీపీ హయాంలో భ్రష్టుపట్టిపోని వ్యవస్థ అంటూ ఏపీలో లేదు. యూనివర్శిటీల వైన్ చాన్సలర్లను దాదాపుగా అందర్నీ ఒకే వర్గాన్ని నియమించారు. కుదరకపోతే భజన చేసే వాళ్లను పెట్టుకున్నారు. వారందరితో విద్యావ్యవస్థను ఎంత భ్రష్టుపట్టించాలో అంతా పట్టించారు. నిధుల దుర్వినియోగం దగ్గర్నుంచి రాజకీయ కార్యకలాపాల వరకూ మొత్తానికి యూనివర్శిటీలకు కేంద్ర స్థానాన్ని చేశారు. వైసీపీ ఓడిపోయే సరికి చాలా మంది .. సైలెంట్ అయిపోయారు. తమ పదవిని కాపాడుకునే ప్రయత్నం చేశారు.
కానీ వైసీపీతో వారు అంటకాగింది అంతర్గతంగా కాదు.. బహిరంగంగానే . అందుకే విద్యార్థుల నుంచి వచ్చే నిరసనలను తట్టుకోలేక వరుసగా రాజీనామాలు చేస్తూ పోయారు. నిజానికి వారి నియామకం గవర్నర్ చేతుల మీదుగా జరుగుతుంది. రాజీనామాలు చేయకపోయినా ప్రభుత్వం ఏమీ చేయలేదు. మహా అయితే ఒత్తిడి తీసుకురాగలదు. కానీ ప్రస్తుతం జగన్ నియమించిన యూనివర్శిటి వీసీలు,రిజిస్ట్రార్లు అంతా రాజీనామాలు చేస్తున్నారు. ఏయూ వీసీ ప్రసాదరెడ్డి లాంటి వాళ్లు మొండికేసినా… చేసినవవి ఏమీ చిన్న చిన్న అక్రమాలు కాకపోవడంతో ఎందుకైనా మంచిదని ప్రభుత్వానికి ఎదురెళ్లడం ఇష్టం లేక రాజీనామాలు చేస్తున్నారు.
ఇప్పటికే మొడికేసిన వీసీలు సహా అనేక మంది రాజీనామా చేశారు. మరికొంత మంది దారిలో ఉన్నారు. అయితే రాజీనామాలు చేసి వెళ్లిపోయినా సరే అక్రమాల గురించి వదిలే సమస్యే ఉండదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏయూ వీసీ ప్రసాదరెడ్డి వందల కోట్లు దుర్వినియోగం చేశారని మొత్తం బయటకు తీస్తామని గంటా శ్రీనివాసరావు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.