తిరుమలలో గత ఐదేళ్లలో జరిగిన అక్రమాల లెక్క తీస్తూంటే.. స్వరూపానంద కటౌట్ కూడా గట్టిగానే కనిపిస్తోంది. జగన్ వద్ద తనకు ఉన్న పలుకుబడిని ఆసరా చేసుకుని ఆయన తిరుమలలో చక్రం తిప్పారు. నిబంధనలు ఉల్లంగించారు. పెద్దఎత్తున ఆదాయం మూటగట్టుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేపట్టిన ఓ నిర్మాణం అన్నిరకాల నిబంధనలను ఉల్లంఘించి నిర్మించారు. ఇప్పడది చర్చనీయాంం ్వుతోంది.
ధర్మ పరిరక్షణ పేరుతో టీటీడీ నుంచి శారదాఫీటం తిరుమలలో స్థలం పొందింది. అక్కడ పెద్ద గెస్ట్ హౌస్ కట్టేశారు. అక్కడ రెండు, మూడు అంత్తులకు మించి పర్మిషన్ ఉండదు. కానీ ఆయన ఐదు అంతస్తులు తన గెస్ట్ హౌస్ కట్టేశారు. అది శ్రీవారి ఆలయం గోపురం కంటే ఎక్కువగా ఉంది. దీనిపై హైకోర్టులోనూ పిటిషన్ దాఖలయింది. శారదా పీఠం మఠాన్ని స్వామీజీలు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలుగా తేల్చేశారు. శారదా పీఠాధిపతి ఆక్రమించిన భూములతో పాటు అక్రమ నిర్మాణాలను తొలగించాలని వీరి డిమాండ్ చేస్తూ ఆందోళనకు కూడా దిగుతున్నారు.
ఆధ్యాత్మిక గురువులకు సంబంధించి స్వామివారికి సేవ చేసుకోవడానికి, భక్తులకు ఉపయోగపడేందుకు మాత్రమే మఠాలను కేటాయిస్తారు. కానీ వాటిని నిర్వహిస్తున్న వారు మాత్రం కొండపై పెద్ద ఎత్తున భక్తుల వద్ద దోపిడీకి పాల్పడుతున్నారు.నే రూల్స్‌ను అతిక్రమించి స్టార్ హోటల్‌ను తలపించేలా కొండపై స్వరూపానంద గెస్ట్ హౌస్ ఉంది. అందుకే కూల్చేయాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.