జగన్ రెడ్డిని నమ్మి ఆయన దోపిడీలో భాగమైన కలెక్టర్లకు ఇప్పుడు తాము చేసిన తప్పేమిటో తెలియబోతోంది. ఇసుక దోపిడినీ బహిరంగంగా చేయడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఏకంగా సుప్రీంకోర్టు, ఎన్జీటీకే తప్పుడు పత్రాలు సమర్పించారు. అదీ కూడా దొరికిపోయేలా. ఇప్పుడా కలెక్టర్ల వ్యవహారంలో రోజుకో గుట్టు బయటకు వస్తోంది.
సుప్రీంకోర్టు, ఎన్జీటీ కళ్లకు గంతలు కట్టేలా తప్పుడు నివేదికలను ఇచ్చారు కలెక్టర్లు. అంతా పైవాళ్లు చెప్పినట్లుగానే చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గుప్పిట్లో పని చేసిన ద్వివేదీ అందరికీ ఒకటే ఫామ్ పంపి.. అదే రీతిలో సంతకాలు చేసి నివేదికలు తెప్పించుకున్నారు. అయితే బిగినర్స్ మిస్టేక్స్ లాగా.. తాము తనిఖీలు చేయడానికి ముందు తేదీలలోనే నివేదికలు ఇచ్చేశారు. ఈ వ్యవహారం లేఖలతో సహా బయటపడింది. కలెక్టర్లు అంతా అడ్డంగా ఇరుక్కున్నారు. ఒకరిద్దరు కలెక్టర్లు మాత్రం ఆ ఫార్మాట్లో నివేదికలు ఇచ్చేందుకు సిద్ధపడలేదు.
ఇటీవల బదిలీ అయి… జీఏడీలో రిపోర్టు చేసిన కలెక్టర్లు అందరూ ఇలా దొరికిపోయినవారే. పోస్టింగులు పొందిన కొంత మందిది కూడా అదే బాపతు. వీరందరూ కేసుల్లో ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ రెడ్డి దోపిడికి నిర్మోహమాటంగా సహకరించడం ఒక ఎత్తు అయితే ఏకంగా సుప్రీంకోర్టుకు తప్పుడు నివేదికలు ఇవ్వడం సామాన్యమైన తప్పుగా భావించడం లేదు. కొంత మంది సర్వీసును కోల్పోయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.