ఆర్కే పలుకు : కేసీఆర్ జాతకం ఇప్పుడల్లా మారదు !

ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఈ వారం ఫామ్ హౌస్ లో కేసీఆర్ నడుపుతున్న సమావేశాలు అందులో జరుగుతున్న వింతలు, విశేషాలనుు బయట పెట్టారు.. కేసీఆర్ తన పార్టీ నేతలుక చెబుతున్నదేమిటంటే ఇప్పటికీ రెండు నెలల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తొందరపడి ఎవరూ పార్టీ మారవద్దు అని. అయితే కేసీఆర్ అంటేనే పిట్టలదొర కబుర్లుకాబట్టి ఎవరూ నమ్మడం లేదని ఆర్కే చెబుతున్నారు. ఆ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు కాబట్టి కొన్ని ఆడియో టేపులు వినిపించారని అందులో కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి, భట్టి విక్రమార్క … రేవంత్ రెడ్డి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు .. వారంతా ఎమ్మెల్యేలను తీసుకుని బీఆర్ఎస్‌లోకి వస్తారని … బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న మాటలు ఉన్నాయి. వీటిని వినిపించి పార్టీ మారవద్దని కేసీఆర్ అంటున్నారు.

కేసీఆర్ ఎమ్మెల్యేలకు వినిపిస్తున్న ఆడియో టేపులు ఎన్నికలకు ముందువా..తర్వాతవా అన్నది చాలా మందికి డౌట్ గానే ఉన్నాయి. ట్యాపింగ్ చేయించి దాచి పెట్టుకున్న ఆడియో టేపులు ఇప్పుడు వినిపిస్తూ ఉండవచ్చు..లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరవాత కూడా ట్యాపింగ్ చేస్తూ ఉండవచ్చు. అలాంటి చాన్స్ తక్కువ కాబట్టి.. పాత టేపులే అయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే కేసీఆర్ ఇలా పార్టీ ఎమ్మెల్యేలకు టేపులు వినిపిస్తే మొదటికే మోసం వస్తుందని తెలుసు..తనపై ట్యాపింగ్ అనుమానాలు పెరుగుతాయ.. టాపిక్ బయటకు పోతుంది కాబట్టి కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి వంటి వాళ్లు విరుచుకుపడతారు. అయినా ఆయన తన రాజకీయం కోసం బయట పెట్టారని కేసీఆర్ అంత స్వార్థపరుడని ఆర్కే పరోక్షంగా విశ్లేషిచారు.

జాతకాల్ని నమ్మే కేసీఆర్.. ప్రస్తుతం తన పరిస్ధిది బాగో లేదని.. వచ్చే కొద్ది రోజుల్లో మారిపోతుందని గ్రహస్థితులు అనుకూలంగా వస్తాయని కేసీఆర్ చెబుతున్నారు కానీ.. ఆర్కే మాత్రం కేసీఆర్ జాతకం ఇప్పుడల్లా మారదని తేల్చేస్తున్నారు. వచ్చే వారంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని.. కేసీఆర్ ను నమ్ముకుని బీజేపీ అతుకుల బొంత రాజకీయాలు చేసేందుకు సిద్ధపడదని ఆ పార్టీ మహారాష్ట్ర పరిణామాలతోనే గుణపాఠం నేర్చుకుందని చెబుతున్నారు. అంతిమంగా కేసీఆర్‌ను నమ్మి బీఆర్ఎస్‌లోనే ఉండి మునిగిపోవద్దని ఆర్కే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పరోక్ష సలహా ఇచ్చేశారు తన కొత్తపలుకు ద్వారా.

కేసీఆర్ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉన్న ఆర్కే… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందో రేవంత్ కు తానే సమాచారం ఇస్తున్నట్లుగా ఈ వారం కొత్త పలుకు రాసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ఆకర్ష్ కు తన మద్దతు ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘బింబిసార‌’ సీక్వెల్ కాదు… ప్రీక్వెల్‌!

క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది 'బింబిసార‌'. వ‌శిష్ట ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ హిట్ తోనే వ‌శిష్ట చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ అందుకొన్నాడు. ఇప్పుడు...

కేసీఆర్ ను వెక్కిరిస్తోన్న సెంటిమెంట్!

అవును.. కేసీఆర్ నమ్ముకున్న సెంటిమెంటే ఆయనను వెక్కిరిస్తోంది. ప్రత్యర్ధి వ్యూహమో, యాదృచ్చికమో కానీ బలంగా విశ్వసించే ఆ సెంటిమెంటే కేసీఆర్ ను తీవ్రంగా కలచివేస్తోంది. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆరు.. ఆరు.. అని కలవరించిన...

యూవీతో శ్రుతిహాస‌న్‌?

యూవీ క్రియేష‌న్స్ ఇప్పుడు చిన్నా, మీడియం రేంజ్ సినిమాల‌పై దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతం శ్రుతిహాస‌న్ కోసం ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ని సిద్థం చేసిన‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమాతో...

బస్సులోనే ప్రసవం.. మహిళా కండక్టర్ మానవత్వం

మ‌హాన‌గ‌రంలో ఇంకా మాన‌వ‌త్వం బ‌తికే ఉంద‌ని చాటారు మ‌హిళా కండక్ట‌ర్. ఆర్టీసీ బ‌స్సులో పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణీకి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. హైద‌రాబాద్ లోని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close