జోగి రమేష్ పోలీసులు ఎప్పుడు వస్తారా అని తన ఇంట్లో ఎదురుచూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన అడ్డగోలుగా చేసిన భూకబ్జాలపై పూర్తి స్థాయి ఆధారాలతో సహా ఫైల్ డీజీపీ వద్దకు చేరింది. ఆ ఫైల్ ను సీఐడీకి ఇవ్వాలా ఏసీబీకి ఇవ్వాలా అన్న దాన్ని డిసైడ్ చేసిన తర్వాత ఆయనపై తదుపరి చర్యలు ఉంటాయి.
జోగి రమేష్ కబ్జా చేసింది .. అమ్మేసింది అగ్రిగోల్డ్ ఆస్తి. స్వయంగా అగ్రిగోల్డ్ యజమానులే ఫిర్యాదు చేశారు. వైసీపీ ఉన్నప్పుడు అంతా మాదే అనుకున్నారు… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తుంది కాబట్టి… ఖాతాల్లో కలిపేసుకోవడం సులువు అనుకున్నారు. కానీ పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం మారింది. ఆయన కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తప్పించుకోవడానికి కూడా అవకాశం లేనంత పబ్లిక్ గా కబ్జా చేసి అమ్ముకున్నారు. జోగి రమేష్ కుమారుడు ఇందులో ప్రత్యక్షంగా ఉన్నారు. అంటే తండ్రీ కొడుకులు ఇద్దరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే జోగి రమేష్ .. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో నిందితుడు. కానీ ఆయన పేరు పెట్టలేదు. పోలీసులు ఆ కేసును కూడా బయటకు తీస్తున్నారు. తన పదవి కోసం ఇష్టం వచ్చినట్లుగ నోరు పారేసుకుని దాడులకూ పాల్పడుతూ… అరాచకం చేసిన జోగి రమేష్ కు ఇప్పుడు అసలు సినిమా కనిపించబోతోందని కృష్ణా జిల్లాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.