హోదా యోధ జగన్కు మంచి అవకాశం వచ్చింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టారు. మరి ఏపీ ప్రభుత్వం ఎందుకు పెట్టదని అడిగే అవకాశం జగన్ కు లభించింది. ప్రత్యేకహోదా అడగకపోవడం పెద్ద పాపమని..తమ పార్టీ అంతర్గత సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు. కానీ ఆ టాపిక్ మీద ఎన్డీఏ మీద.. బీజేపీ మీద విమర్శలు చేసి పోరాటం చేయడానికి ఆయన ముందుకు రావడం లేదు
ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ ప్రత్యేకహోదా గురించి చెప్పలేదు. 2019లో హోదా ఇవ్వలేదని కేంద్రం నుంచి బయటకు వచ్చి ఎన్డీఏకి వ్యతిరేకంగా పోటీ చేస్తే ప్రజలు ఆదరించలేదు. ఇటీవలి ఎన్నికల్లో హోదా ఇస్తామని కానీ. తెస్తామని కానీ ఎక్కడా చెప్పలేదు. . ప్రత్యేక హోదా అంశానికి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందా లేదా అన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే గతంలో ఈ హోదా పేరుతో అన్ని పార్టీలు ఓట్లు పొందాయి. ఎవరూ ఇవ్వలేదు .. తీసుకురాలేదు. హోదా విషయంలో ప్రజలు ఆసక్తి కోల్పోయారు.
అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అన్నా..జేడీ లక్ష్మినారాయణ పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్న జగన్.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరమైని ఉద్యమం చేస్తే కామెడీ అవుతుంది. అయినా సరే ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ కు ప్రత్యేక ఆయుధం దొరికినట్లే .. కానీ దాన్ని మోసే ధైర్యం జగన్ కు లేదు. కేసుల లగేజీ కావొచ్చు.. మరో అంశం కావొచ్చు ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్లడానికి జగన్ సిద్దంగా లేరు. స్పీకర్ ఎన్నికలోనూ ఆయన ఏకపక్షంగా మద్దతు ప్రకటించారు. తర్వాత ఏదైనా అవసరం వచ్చినా ఆయన మద్దతిస్తారు. అలాంటిది ఇప్పుడు హోదా విషయంలో ఎన్డీఏను విలన్ ను చూసి ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం ఆయనకు లెదు. అందుకే బెంగళూరు ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు.