చట్టబద్ధంగా అమలులో వచ్చిన రెడ్ బుక్ !

రాజకీయం అంటే ఆవేశం కాదు ఆలోచన .. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకున్న వారికి లాంగ్ పొలిటికల్ లైఫ్ ఉంటుంది. టీడీపీకి చెందిన కొంత మంది సోషల్ మీడియా కార్యకర్త లోకేష్ రెడ్ బుక్ ఏది అంటూ సెటైర్లు వేస్తున్నారు. రెడ్ బుక్ మిస్సింగ్ అంటున్నారు. ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ వారికి మెల్లగా అర్థమవుతున్నదేమిటంటే… అంతా పక్కాగా జరిగిపోతోంది. చట్టబద్దంగా.. ప్రజాస్వామ్య యుతంగా జరిగిపోతోంది.

20 రోజులు కూడా కాలేదు.. చాలా జరిగాయి !

తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఇంకా ఇరవై రోజులు కూడా కాలేదు. కానీ ఎన్ని జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ముందు ముందు ఓ పద్దతి ప్రకారం తప్పు చేసిన వారినందర్నీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడానికి పద్దతిగా అడుగులు పడ్డాయి. అసలు రాజకీయం తెలుసు కాబట్టే… ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే… లిక్కర్ స్కాంలో కేసు నమోదయింది. వాసుదేవరెడ్డిని గుప్పిట్లో పెట్టేసుకున్నారు. మొత్తం బాగోతం విప్పేశాడు. ఎలా దందా జరిగిందో సీఐడీ లెక్క తేల్చబోతోంది. సరైన టైం రావాలంతే. అంతే ఇసుక వ్యవహారంలో తప్పు చేసిన ప్రతి ఒక్కర్నీ వేటాడే నివేదికలు రెడీ అయిపోయాయి. జగన్ తో కలిసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన అధికారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు. జీఏడీకి అటాచ్ అయిపోయారు. వారంతా చంద్రబాబు మంచోడని… గెలవగానే.. వెళ్లి ఓ బోకే ఇచ్చి కాళ్లు పట్టేసుకుంటే పనైపోతుదంని అనుకున్నారు. కానీ చంద్రబాబు అలాంటి చాన్సివ్వలేదు. వారిలో చాలా మంది ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకుంటామని వస్తున్నారు. కానీ చేసిన తప్పులకు శిక్ష అనుభవించకుండా ఎక్కడికిపోతారని… ప్రభుత్వం ఆపుతోంది.

మొరిగిన వైసీపీ నేతలంతా రౌండప్

చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు ఇతరులపై ఇష్టం వచ్చినట్లుగా మొరిగిన నేతలంతా వణికిపోతున్నారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. కానీ వారి చట్టూ ఓ ఫ్రేమ్ రెడీ అయిపోయింది. జోగి రమేష్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు జైలుకు పంపేలా అగ్రిగోల్డ్ కబ్జా కేసు రెడీగా ఉంది. కొడాలి నానిపై పెద్ద పెద్ద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న వాలంటీర్ ఫిర్యాదుతో శ్రీకృష్ణజన్మస్థానానికి పంపేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలియడంతో ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కానీ వదులుతారా ?., వల్లభనేని వంశీ అసలు అడ్రస్ లేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఆయన కుమారుడు పుంగనూరు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇది ఎవరైనా ఊహించగలరా ?. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టబద్ధంగా స్కెచ్ రెడీ అయిపోయింది.

స్కాముల పుట్టపగలడానికి సమాచారం రెడీ

బయటకు తెలుస్తుంది మాత్రమే సమాచారం కాదు.. ప్రభుత్వం అంతర్గతంగా చాలా చేయవచ్చు. అందులో భాగంగా ముందుగా అవి రాజకీయ కక్షలు కాదు అని నిరూపించడానికి అవసరమన సమాచరం మొత్తం బయటకు తీస్తోంది. సెంటు స్థలాల పేరుతో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన దందా మొత్తం వెలికి తీశారు. కేసులు పెట్టడమే మిగిలింది. ఈ విషయం తెలిసి విడదల రజనీ డబ్బులు తిరిగిచ్చేశారు. కానీ అంతకు మించిన కథలు ఆమెపై ఉన్నాయి. ఇంకా మ ద్వారంపూడి, చెవిరెడ్డి, బొత్సా ఇలా గత మంత్రుల చేసిన అవినీతి రికార్డులతో సహా బయట పడుతోంది.

వణికిపోతున్న కూలి మీడియా, వైసీపీ ఫేక్ సోషల్ మీడియా

కూలి మీడియా ఇప్పుడు బాబు బంగారం అనే కథలు చెబుతోంది. అహాఒహో అంటోంది. వైసీపీ ఫేక్ సోషల్ మీడియా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సజ్జల భార్గవ అడ్డంగా దొరికిపోయాడని.. తండ్రి సజ్జల మథనపడుతున్నాడు. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో చేసిన దోపిడీ ఎదురుగానే ఉంది. ఫేక్ అకౌంట్లు గాళ్లంతా పరారీలో ఉన్నారు.

ఇరవై రోజుల్లోనే ఇదంతా – జరగాల్సింది స్మూత్ గా జరిగిపోతుంది !

టెన్షన్ లో నీకు తెలియడం లేదు కానీ… బుల్లెట్ ఎప్పుడో దిగిపోయిందని ఓ సినిమా డైలాగ్ లా.. వైసీపీ నేతలకు దిగిపోతోందని తెలియకుండానే దింపేస్తున్నారు. తాము చేసిన తప్పులను ఇంతపద్దతిగా ఇరికిస్తున్నారా అని ఆ సీనియర్ మంత్రులు కూడా తెలుసుకునేసరికి … వణికిపోతున్నారు. ఏం చేయాలో తెలియక… మాట్లాడటం మానేశారు. రేపోమాపో మీడియా ముందుకు వచ్చి పొగడ్తలు ప్రారంభిస్తారు. అయినా ఎవరూ వారిని రక్షించలేరు.

రెడ్ బుక్ అమలు అంటే… బుక్ చేతిలో పెట్టుకుని టిక్ పెట్టుకుంటూ పోవడం కాదు…. అంతా స్మూత్ గా.. చట్టబద్దంగా జరిగిపోతోంది. మెల్లగా టీడీపీ కార్యకర్తలకూ అర్థమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close