బొత్సా.. ఇంకా ఇదేం రచ్చ!

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి మూడు రాజధానుల నిర్ణయం కూడా ఓ కారణమని ఫలితాలతో ప్రస్ఫుటమైంది. అయినా ఈ విషయాన్ని అంగీకరించేందుకు వైసీపీకి మనసొప్పడం లేదు. ప్రజలు తిరస్కరించిన మూడు రాజధానులకే ఇంకా కట్టుబడి ఉన్నామంటూ తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది.

మూడు రాజధానులపై బొత్స చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమో, పార్టీ విధానమో కానీ వైసీపీకి ఇంకా బుద్ది రాలేదని ప్రజల్లో చర్చ జరుగుతోంది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని వైసీపీ హామీ ఇచ్చినా ఉత్తరాంధ్రలో వైసీపీని ఆదరించలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సింది. కానీ, ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు అహం అడ్దోస్తుందో మరేమిటో కానీ, ఇంకా మూడు రాజధానుల పల్లవిని వినిపిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.

వైసీపీ తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీని ప్రతిపక్ష హోదాకు సైతం దూరం చేశాయి. మూడు రాజధానుల పేరుతో హడావిడి చేసి ఏపీకి రాజధాని లేకుండా చేయడం వైసీపీపై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిందనేది ఓపెన్ సీక్రెట్. ఓటమి తర్వాత ఎందుకీ ఫలితాలు వచ్చాయని విశ్లేషించుకుంటే ఈ విషయం అర్థమై ఉండేదేమో. ఒకవేళ ఈ విషయం అర్థమైనా ఇంకా అహంకారం దోస్తీ చేస్తుండటమే ఈ వ్యాఖ్యలకు కారణమై ఉండొచ్చునని అంటున్నారు.

ఇప్పటికీ వైసీపీ మారకపోతే వచ్చే ఎన్నికల నాటికి 11 సీట్ల నుంచి జీరో నెంబర్ కు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్: మ‌హేష్ విల‌న్ విక్ర‌మ్‌

రాజ‌మౌళి - మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమా కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఉన్నాయి. అందుకే 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' త‌ర‌వాత రాజ‌మౌళి...

బీఆర్ఎస్ గ్రేట‌ర్ మీటింగ్ కు ఆ ఎమ్మెల్యేల డుమ్మా… జంపింగ్ కు రెడీనా?

తాను పాలు పోసిన పెంచి పాము త‌న‌నే కాటేసిన‌ట్లు... తాను అల‌వాటు చేసిన పార్టీ ఫిరాయింపులు త‌న మెడ‌కే చుట్టుకుంటున్నాయి కేసీఆర్ కు. 2014, 2018 ఎన్నిక‌ల త‌ర్వాత ఏ పార్టీలో గెలిచినా......

‘బింబిసార‌’ సీక్వెల్ కాదు… ప్రీక్వెల్‌!

క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది 'బింబిసార‌'. వ‌శిష్ట ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ హిట్ తోనే వ‌శిష్ట చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ అందుకొన్నాడు. ఇప్పుడు...

కేసీఆర్ ను వెక్కిరిస్తోన్న సెంటిమెంట్!

అవును.. కేసీఆర్ నమ్ముకున్న సెంటిమెంటే ఆయనను వెక్కిరిస్తోంది. ప్రత్యర్ధి వ్యూహమో, యాదృచ్చికమో కానీ బలంగా విశ్వసించే ఆ సెంటిమెంటే కేసీఆర్ ను తీవ్రంగా కలచివేస్తోంది. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆరు.. ఆరు.. అని కలవరించిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close