నాని విల‌న్ రానా?

‘హిట్’ ఫ్రాంచైజీని నాని కొన‌సాగించాల‌నుకొంటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ హిట్, హిట్ 2 వ‌చ్చాయి. వాటికి నాని కేవ‌లం నిర్మాత మాత్ర‌మే. హిట్ 3లో హీరోగా, నిర్మాత‌గా ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడు. శైలేష్ కొలను ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో రానా ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. నాని, రానాల మ‌ధ్య మంచి స్నేహం ఉంది. ఓ అవార్డు వేడుక‌కు ఇద్ద‌రూ హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించారు. క‌లిసి తెర పంచుకోవ‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టికే శైలేష్ కొల‌ను క‌థ రెడీ చేసిన‌ట్టు స‌మాచారం. నాని కూడా ఈ క‌థ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. కాక‌పోతే.. ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంతో చూడాలి.

నాని చేతిలో ‘స‌రిపోదా శ‌నివారం’ సినిమా ఉంది. శేఖ‌ర్ క‌మ్ముల‌తో నాని ఓ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. `ద‌స‌రా` ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల‌తో మ‌రో సినిమా చేయ‌డానికి నాని రెడీ అవుతున్నాడు. వీటి మ‌ధ్య ‘హిట్ 3’ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ‘హిట్‌’ అనేది ఓ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌. సైకోల‌ను ప‌ట్టుకోవ‌డానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఆ ఫార్మెట్ లో చూస్తే.. ‘హిట్ 3’లో రానా సైకో కిల్ల‌ర్‌ గా కనిపించే ఛాన్స్ లే ఎక్కువ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

రూ.1000 కోట్ల చేరువలో ‘క‌ల్కి’

'క‌ల్కి' మ్యాజిక్ ఫిగ‌ర్‌కు ద‌గ్గ‌ర కాబోతోంది. రూ.1000 కోట్ల (షేర్‌) వైపు దూసుకు వెళ్తోంది. ప్ర‌స్తుతం 'క‌ల్కి' రూ.900 కోట్ల వ‌సూళ్ల మార్క్ ని అందుకొంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈవారంలో రూ.1000 కోట్లు...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

గెస్ట్ రోల్స్ ఉన్నాయి.. డార్లింగ్‌!

రెండు వారాలుగా 'క‌ల్కి' జాత‌ర కొన‌సాగుతోంది. ఈవారం 'భార‌తీయుడు 2' రాబోతోంది. వ‌చ్చే వారంలో డార్లింగ్ వ‌స్తోంది. 'డార్లింగ్‌' చిన్న సినిమానే అయినా, చాలా ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నాయి. ప్రియ‌ద‌ర్శి హీరోగా చేసిన సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close